కార్మికుల కోసం ప్రత్యేక విమానం వేయించిన ఎన్నారై
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కొచ్చిన్ కు కార్మికులను తీసుకొచ్చేందుకు ఎయిర్ అరేబియా సంస్థకు చెందిన ప్రత్యేకంగా నడిపేలా ఏర్పాట్లు చేసిన కేరళ ఎన్నారై.
కరోనా లాక్ డౌన్ తో ఎక్కడి వారక్కడ చిక్కుపోయారు. ఉపాధి కోల్పోయి సొంతూర్లకు చేరేవారికోసం ప్రభుత్వంతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు ముందుకొస్తున్నారు. తన వద్ద పనిచేసిన వారిని గాలికి వదిలేయకుండా.. తాను వ్యాపారవేత్తనే కాకుండా మనసున్న మంచి వ్యక్తిగా నిరూపించుకున్నాడు కేరళకు చెందిన ఓ ఎన్నారై. కేరళలోని అలప్పుజ పట్టణానికి చెందిన హరికుమార్ షార్జాలో ఎలైట్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూట్స్ సంస్థను స్థాపించి నిర్మాణ రంగంలో రాణిస్తున్నాడు. 20 ఏండ్ల క్రితం ఉపాధి వెతుక్కొంటూ యూఏఈ వెళ్లి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. గల్ఫ్ దేశాల్లో పలు కంపెనీల నెలకొల్పిన హర్షకుమార్ చెందిన సంస్థలో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుకుపోయిన తన 120 మంది కార్మికులను ఇండియాకు పంపించేందుకు ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కొచ్చిన్ కు కార్మికులను తీసుకొచ్చేందుకు ఎయిర్ అరేబియా సంస్థకు చెందిన ప్రత్యేకంగా నడిపేలా ఏర్పాట్లు చేశాడు. తన కంపెనీ కార్మికులతోపాటుు ఉపాధి కరువై స్వగ్రామాలకు వచ్చేందుకు టిక్కెట్లు దొరకని మరో 50 మంది భారతీయులకు కూడా అవకాశం కల్పించారు. ఈ చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా వారందరిని కొచ్చిన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. ఎన్నో విధాలుగా నాకు అండగా నిలిచిన నా కార్మికులకు ధన్వవాదాలు తెలుపుకునే అవకాశం దొరికిందన్నారు ఎలైట్ గ్రూప్ చైర్మన్ హరికుమార్.