రామ్‌చరణ్‌తో మరోసారి కియారా అద్వానీ.. ఆచార్యలో చెర్రీ సరసన బోల్డ్ బ్యూటీ

రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ సినిమాలో జతకట్టింది ఈ భామ. ఇక రామ్‌చరణ్ తో మరోసారి కియారా అద్వానీ జతకట్టనుందని సమాచారం.

రామ్‌చరణ్‌తో మరోసారి కియారా అద్వానీ.. ఆచార్యలో చెర్రీ సరసన బోల్డ్ బ్యూటీ
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 08, 2020 | 11:11 AM

భరత్ అనే నేను చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీకి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నటించింది తక్కువ సినిమాలే అయినా ఆమెకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ సినిమాలో జతకట్టింది ఈ భామ. ఇక రామ్‌చరణ్ తో మరోసారి కియారా అద్వానీ జతకట్టనుందని సమాచారం. రెండోసారి ఈ జోడీ తెరపై కనపడనుందని టాక్. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్యలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుందట.

ఈ మూవీలో చరణ్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. విద్యార్థి నాయకుడిగా ఆయన రోల్ ఉండనుంది. అయితే రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేశారట. వచ్చే నెలలో ఈ ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొంటాంరని వినికిడి. మరోవైపు హిందీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఆమె నటించిన హిందీ చిత్రం ఇందూకీ జవానీ ఈ నెల 11న రిలీజ్‌ కానుంది. ఇక వెబ్ సిరీస్‌లోనూ అదరగొడుతోంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇక ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలోనూ ఈ అమ్మడికి ఛాన్స్ వచ్చిందట.