Kia India Aid: కోవిడ్‌పై ఫైట్.. ఏపీ ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా.. గతంలో రూ.5 కోట్ల సాయం.. తాజాగా

|

Jul 05, 2021 | 3:41 PM

మానవాళి ఎదుర్కొంటున్న కరోనా మహావిపత్తుపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా పది లక్షల మాస్క్ లను అందించింది. దీనికి సంబందించిన పత్రాన్ని...

Kia India Aid: కోవిడ్‌పై ఫైట్.. ఏపీ ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా.. గతంలో రూ.5 కోట్ల సాయం.. తాజాగా
Kia Masks Donations
Follow us on

మానవాళి ఎదుర్కొంటున్న కరోనా మహావిపత్తుపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా పది లక్షల మాస్క్ లను అందించింది. దీనికి సంబందించిన పత్రాన్ని, శ్యాంపిల్ మాస్క్ లను సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబుకు కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్ కబ్ డాంగ్ లీ అందించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ (సిఎస్సార్) క్రింద మాస్క్ లను అందించిన కియా ఇండియా ప్రతినిధులను కమిషనర్ కన్నబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్ & కార్పోరేట్ హెడ్ జూడ్ లీ , ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ.. ఈ మాస్క్ లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలియజేశారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం ఎంత దారుణంగా ఉందో చూశామని.. కలసికట్టుగా విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ఎవరికివారు తమవంతు సాయం అందించి సమిష్టి కృషితో మహమ్మారిని ఎదుర్కోవాలని సూచించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోడంలో ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపారులు, ఆర్ధిక స్థోమత ఉన్న కార్పొరేట్ సంస్థ నిర్వాహకులు భాగస్వాములు కావాలని విపత్తుల శాఖ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలకు కియా ఇండియా  5 కోట్ల విరాళం

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యల కోసం కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మే నెలలో 5 కోట్ల విరాళం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్థకు విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి రూ. 5 కోట్లు ఎన్ఈఎఫ్‌టీ ద్వారా ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన ప‌త్రాల‌ను అంద‌జేశారు కియా ప్రతినిధులు. విరాళానికి సంబంధించిన పత్రాలను సీఎం జగన్​కు కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో కుక్​హ్యున్‌ షిమ్‌ అందించారు. విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలు వినియోగించాలని కోరారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్, క్రయోజనిక్‌ ట్యాంకర్ల అవసరాలు వినియోగించాలని విన్నవించారు.

Also Read: అతడు పెళ్లి చేసుకోవట్లేదు.. వేరేవాళ్లని చేస్కోనివ్వట్లేదు.. దీంతో ఆమె ఏం చేసిందంటే..?

అమ్మ అపస్మారక స్థితిలో.. తమ్ముడు గుక్కెట్టి ఏడుస్తున్నాడు.. ఆ చిట్టి తల్లి ఏం చేసిందంటే