ఇదిగో ‘ద్వాదశాదిత్య’ ఖైరతాబాద్ గణేషుడు

ఈ సంవత్సరానికి గానూ ప్రముఖ ఖైరతాబాద్ గణేషుడి విగ్రహ నమూనాను గణేష్ ఉత్సవ్ కమిటీ రూపొందించింది. మొత్తం 12 తలలు, 24 చేతులు, ఆరు సర్పాలు, సప్తాశ్వాలతో కూడిన సూర్య రథంపై గణనాథుడు కొలువుకానున్నాడు. ఈ విగ్రహం 61 అడుగుల ఎత్తు ఉండగా.. కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గా దేవి ఉండనున్నారు. ఈ గణపతి విగ్రహాన్ని శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతిగా పేర్కొంటున్నారు. ఇక […]

ఇదిగో ‘ద్వాదశాదిత్య’ ఖైరతాబాద్ గణేషుడు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 25, 2019 | 5:02 PM

ఈ సంవత్సరానికి గానూ ప్రముఖ ఖైరతాబాద్ గణేషుడి విగ్రహ నమూనాను గణేష్ ఉత్సవ్ కమిటీ రూపొందించింది. మొత్తం 12 తలలు, 24 చేతులు, ఆరు సర్పాలు, సప్తాశ్వాలతో కూడిన సూర్య రథంపై గణనాథుడు కొలువుకానున్నాడు. ఈ విగ్రహం 61 అడుగుల ఎత్తు ఉండగా.. కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గా దేవి ఉండనున్నారు. ఈ గణపతి విగ్రహాన్ని శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతిగా పేర్కొంటున్నారు. ఇక విగ్రహ తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి 150మంది కళాకారులు రాత్రుంబవళ్లు శ్రమించినట్లు ముఖ్య శిల్పాకళాకారుడు సి. రాజేంద్రన్ తెలిపారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 2న వినాయక చవితి జరుపుకోనున్నారు.