Jagan AmithShah Meet: అమిత్‌షాతో జగన్ భేటీ.. ఇదే మెయిన్ టాపిక్

Key point in Jagan and Amithshah meet: రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భేటీలో అసలు పాయింట్ ఏంటో తెలిసిపోయింది. ప్రధానిని కలిసిన రెండో రోజునే జగన్ కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ గా భావిస్తున్న అమిత్‌షాతో భేటీ కానుండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. గతంలో జగన్ ఢిల్లీ వెళితే.. కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేకపోయిన అమిత్‌షా ఇపుడు తానంతట తానే అపాయింట్‌మెంట్ […]

Jagan AmithShah Meet: అమిత్‌షాతో జగన్ భేటీ.. ఇదే మెయిన్ టాపిక్
Follow us

|

Updated on: Feb 14, 2020 | 6:42 PM

Key point in Jagan and Amithshah meet: రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భేటీలో అసలు పాయింట్ ఏంటో తెలిసిపోయింది. ప్రధానిని కలిసిన రెండో రోజునే జగన్ కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ గా భావిస్తున్న అమిత్‌షాతో భేటీ కానుండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. గతంలో జగన్ ఢిల్లీ వెళితే.. కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేకపోయిన అమిత్‌షా ఇపుడు తానంతట తానే అపాయింట్‌మెంట్ ఖరారు చేసి మరీ జగన్‌ను ఢిల్లీకి పిలవడం వెనుక కారణాలపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

నిజానికి జగన్ ప్రధానమంత్రితో భేటీ అయిన వెంటనే వైసీపీ.. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో చేరి రెండు మంత్రి పదవులు పొందబోతోందని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం బీజేపీ శిబిరం నుంచి మొదలైనా.. వైసీపీ వర్గాలు గట్టిగా ఖండించలేకపోతున్నాయి. కేంద్రంలో చేరేది లేదని ఒకరిద్దరు వైసీపీ నేతలు అంటున్నా.. గట్టిగా చెప్పలేకపోవడంతో దాల్ మే కుచ్ కాలా హై అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జగన్, అమిత్‌షా భేటీలో అసలు పాయింట్ వెలుగులోకి వచ్చేసింది. కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలని, ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవాలని బీజేపీ నేతలు జగన్‌ను కోరింది నిజమేనంటున్నారు. అయితే.. ఈ రెండు పార్టీల కలయిక ఉభయతారకంగా వుండాలన్నది బీజేపీ కండీషన్ అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ప్రధానమంత్రి మోదీతో సీఎం జగన్‌ ఏం చర్చించారు? అనే విషయం మాత్రం ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఏపీకి కావాల్సిన సాయంపై ఆయన పది అంశాలు ప్రస్తావించారని తెలిసింది. కేంద్రమంత్రివర్గంలో వైసీపీని చేరాలని మోదీ అహ్వానించారని ఓ ప్రచారం నడుస్తోంది. ఈవిషయంపై మాట్లాడేందుకు అమిత్‌షాను కలవాలని మోదీ సూచించారని టాక్‌. కానీ ఈవిషయంపై బీజేపీ నుంచి లీకులు వస్తే…వైసీపీ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం రావడం లేదు. ఈ విషయంపై వారం పది రోజుల్లో క్లారిటీ వస్తోందని తెలుస్తోంది. అయితే మోదీతో జగన్‌ సమావేశంలో మరో అంశం చర్చకు వచ్చిందని తెలుస్తోంది. అదే రాజ్యసభ సీటు డిస్కషన్‌.

మార్చి నెలలో రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ ఖాతాలో నాలుగు సీట్లు పడబోతున్నాయి. ఇప్పటికే ఆ సీట్ల కోసం పోటీ నెలకొంది. అయితే రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. పలు రాష్ట్రాల నుంచి తమ సభ్యులను రాజ్యసభకు పంపుతోంది. ఇప్పుడు ఏపీ నుంచి కూడా ఒకరిని రాజ్యసభకు పంపాలని బీజేపీ ఆలోచిస్తోందట. వైసీపీకి దక్కే నాలుగు సీట్లలో ఒక సీటు తమకు ఇవ్వాలని మోదీ జగన్‌ను కోరారట.

Also read: Janasena worried of YCP, BJP friendship

సీటుపై అమిత్‌షాతో మీటింగ్‌లో కూడా జగన్‌ చర్చించే అవకాశం కన్పిస్తోంది. గతంలో కూడా టీడీపీ సర్కార్‌ ఉన్నప్పడు ఓ సీటును బీజేపీకి కేటాయిస్తూ వచ్చారు. అప్పట్లో నిర్మలా సీతారామన్, సురేష్‌ ప్రభు ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు అదే ఆనవాయితీ ప్రకారం తమకు సీటు ఇవ్వాలని బీజేపీ పెద్దలు కోరారట. దీంతో జగన్‌ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అమిత్‌షా మీటింగ్‌లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎవరూ పంపుతారనే విషయం చర్చించే చాన్స్‌ ఉంది.

కేంద్రంతో మరో నాలుగేళ్లు క్లోజ్‌గా నడవాలి. ఏపీకి బీజేపీ సర్కార్‌తో చాలా పనులు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో భాగంగా నడవాల్సి ఉందని…ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వకపోతే బీజేపీతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మూడు రాజధానులతో పాటు పలు కీలక బిల్లులు కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ఇలాంటి టైమ్‌లో కేంద్రంతో గొడవ ఎందుకు? వారికి ఓ సీటు ఇస్తే సరిపోతుందని జగన్‌ ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా బీజేపీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించారని తెలుస్తోంది. మొత్తానికి ఆ ఒక్కటీ తమకు ఇవ్వాలని కమలం పెద్దలు అడగడం…జగన్‌ ఇవ్వడం జరిగిందని సమాచారం.

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!