AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే గదిలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురి మృతదేహాలు.. సూసైడ్ నోట్‌లో సంచలనాలు!

కేరళలోని కొచ్చిలో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం (మార్చి 21) వడుతల ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో ముగ్గురు అమాయక పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగింది. ప్రాథమిక విచారణలో ఇది సామూహిక ఆత్మహత్యగా తెలుస్తోంది.

ఒకే గదిలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురి మృతదేహాలు.. సూసైడ్ నోట్‌లో సంచలనాలు!
Kerala Mysterious Death
Balaraju Goud
|

Updated on: Mar 22, 2026 | 7:58 AM

Share

కేరళలోని కొచ్చిలో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం (మార్చి 21) వడుతల ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో ముగ్గురు అమాయక పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగింది. ప్రాథమిక విచారణలో ఇది సామూహిక ఆత్మహత్యగా తెలుస్తోంది. ఇద్దరు మహిళలు తమ పిల్లలను చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

పోలీసుల తెలిపిన కథనం ప్రకారం, మృతులను 58 ఏళ్ల శ్రీకుమారి, ఆమె కుమార్తె 36 ఏళ్ల అశ్వతి నాయర్, మిగిలినవారు అశ్వతి ముగ్గురు పిల్లలుగా గుర్తించారు. ఆ పిల్లలలో 14, 4 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, 2 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఈ కుటుంబం వాస్తవానికి తిరువనంతపురంలోని విలప్పిల్‌సాలకు చెందినది. చికిత్స కోసం కొచ్చికి వచ్చిన ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, ఆ కుటుంబం ఫిబ్రవరి నుంచి కొచ్చిలోని వడుతల, కరస్కా రోడ్డులో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆ కుటుంబంలోని పెద్ద కుమారుడు సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని బాగోగులు చూసుకోవడానికి వారు అక్కడే ఉంటున్నారు. త్వరలోనే ఆ ఇంటిని ఖాళీ చేయబోతున్నారని, అయితే ఆ సమయానికి ముందే ఈ ఘోర సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషాదకర సంఘటన శనివారం (మార్చి 21) మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ పని మీద ఆ ఇంటికి వచ్చాడు. అతను కిటికీలోంచి గదిలోకి తొంగి చూడగా, ఇద్దరు మహిళలు ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతను వెంటనే కేకలు వేసి, చుట్టుపక్కల వారిని, పోలీసులను అప్రమత్తం చేశాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్నాకులం నార్త్ పోలీసులు, ఇంట్లో ఒక ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకుమారి, అశ్వతి ఉరి వేసుకునే ముందు తమ ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్ష తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణం స్పష్టమవుతుందని పోలీసు అధికారి తెలిపారు. ఆత్మహత్య లేఖ ఆధారంగా, ఒక సంతోషకరమైన కుటుంబం విచ్ఛిన్నం కావడానికి దారితీసిన బలవంతపు పరిస్థితులు ఏమిటో పోలీసులు ఇప్పుడు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులా లేక ఆసుపత్రి చికిత్స ఒత్తిడా, పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us