AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSB Head Constable Jobs 2026: నెలకు రూ.81,100 జీతంతో సశస్త్ర సీమాబల్‌లో పోలీస్‌ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సశస్త్ర సీమా బల్ (SSB).. 2026-27 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం..

SSB Head Constable Jobs 2026: నెలకు రూ.81,100 జీతంతో సశస్త్ర సీమాబల్‌లో పోలీస్‌ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
SSB Head Constable Jobs
Srilakshmi C
|

Updated on: Mar 22, 2026 | 6:54 AM

Share

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (SSB).. 2026-27 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ, స్టీవార్డ్ విభాగాల్లో మొత్తం 233 హెడ్‌ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇలా..

  • హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) పోస్టులు: 197
  • హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) పోస్టులు: 29
  • హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ) పోస్టులు: 5
  • హెడ్ కానిస్టేబుల్ (స్టీవార్డ్) పోస్టులు: 2

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి పదో తరగతి లేదా సైన్స్‌ గ్రూప్‌లో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎలక్ట్రీషియన్, వెటర్నరీకి, స్టీవార్డ్‌ పోస్టులకు మాత్రం సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమాలో అర్హత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పోస్టులకు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలక్ట్రీషియన్ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్లు వరకు వయోపరిమితి ఉంటుంది. నిబంధనల మేరకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ వెలువడిన 30 రోజుల్లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

ప్రకటన మార్చి 21, 2026వ తేదీన వెలువడింది. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (PET), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST), రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

సశస్త్ర సీమాబల్‌లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us