AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో సాకర్ ఫ్లేయర్ హంసకోయ మృతి

కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న సంతోష్‌ ట్రోఫీ మాజీ ఫ్లేయర్ హంసకోయ (61) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఐదుగురు కరోనా పాజిటివ్‌తో మంజేరిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం హంసకోయకి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

కరోనాతో సాకర్ ఫ్లేయర్ హంసకోయ మృతి
Balaraju Goud
|

Updated on: Jun 06, 2020 | 5:26 PM

Share

కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న సంతోష్‌ ట్రోఫీ మాజీ ఫ్లేయర్ హంసకోయ (61) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఐదుగురు కరోనా పాజిటివ్‌తో మంజేరిలోని ఆస్పత్రిలోని కంటైన్మెంట్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే శనివారం హంసకోయకి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 21 న ముంబై నుంచి తిరువనంతపురం వచ్చిన హంసకోయ, ఇతర కుటుంబసభ్యులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తొలుత ఆయన కోడలుకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారించి క్వారంటైన్ కి తరలించారు. అనంతరం హంసకోయతో పాటు కుటుంబసభ్యలకు కూడా పాజిటివ్‌గా తేలగా ప్రత్యేక వార్డుకు తరలి చికిత్స చేస్తున్నారు. అయితే ఆయనకు ఇతర సమస్యల కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్లాస్మా థెరపీ చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరకు వెంటిలేటర్‌పై రెండురోజులపాటు కొనసాగిన హంసకోయకు గుండెపోటుతో మృతిచెందినట్లు తిరువనంతపురం వైద్యాధికారి డాక్టర్‌ కే సకీనా ధ్రువీకరించారు. మలబార్‌కు చెందిన హంసకోయ.. చిన్ననాటి నుంచే ఫుట్‌బాల్‌ అంటే మక్కువ. ఉన్నత విద్య చదివే రోజుల్లో కాలికల్‌ యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మహారాష్ట్ర తరఫున సంతోష్‌ ట్రోఫిలో 1981-86 లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జట్టులో చోటుసంపాదించి నెహ్రూ ట్రోపీలో కూడా ఆడారు. మోహన్‌ బగాన్‌, రైల్వేస్‌, టాటా స్పోర్ట్స్‌ వంటి అనేక క్లబ్బులకు ప్రాతినిధ్యం వహించారు. రిటైర్మెంట్‌ తర్వాత ముంబైలో స్థిరపడిన హంసకోయ మృతిపట్ల పలువురు క్రీడాకారులు సానుభూతి తెలిపారు.

Follow Us
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్