రానాకి గుడ్ బై చెప్పిన మహానటి..?

రానాకి గుడ్ బై చెప్పిన మహానటి..?

మహానటి చిత్రంతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకరైన రానా దగ్గుబాటి మూవీలో యాక్ చేయడానికి నో చెప్పింది. అయితే రానా.. సినిమా కెరీర్ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు..? అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు ప్రశ్నగానే వుంటోంది..? అతడెప్పుడో అనుకున్న ప్రాజెక్టులన్నీ దాదాపు డైలమాలో పడిపోయాయి. కొన్ని షూటింగ్‌లు ఆగిపోతే.. మరికొన్నిటికి కాస్టింగ్ సమస్య వేధిస్తోంది. ఇక అనారోగ్య కారణాలతో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 20, 2019 | 6:01 PM

మహానటి చిత్రంతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకరైన రానా దగ్గుబాటి మూవీలో యాక్ చేయడానికి నో చెప్పింది. అయితే రానా.. సినిమా కెరీర్ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు..? అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు ప్రశ్నగానే వుంటోంది..? అతడెప్పుడో అనుకున్న ప్రాజెక్టులన్నీ దాదాపు డైలమాలో పడిపోయాయి. కొన్ని షూటింగ్‌లు ఆగిపోతే.. మరికొన్నిటికి కాస్టింగ్ సమస్య వేధిస్తోంది. ఇక అనారోగ్య కారణాలతో రాణా అమెరికాకు వెళ్లి మూడేళ్లవుతోంది. రాాణా కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. చికాగోలో ఉన్నా.. అంతా ఒకే ఇంకొన్ని రోజుల్లో వస్తున్నా .. అని చెప్పిన రాణా ఇండియాకు రానేలేదు.

అమెరికాలో వుంటూనే అప్‌కమింగ్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఆ క్రమంలోనే ఓ హార్రర్ క్రైమ్ స్టోరీకి కమిటయ్యాడు. దాన్ని మిలింద్ రావ్ అనే తమిళ్ డైరెక్టర్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల సిద్దార్థ్ హీరోగా గృహం అనే సినిమా చేసి విజయం సాధించాడు ఆ డైరెక్టర్. కాని.. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. మిస్ ఇండియా మూవీతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తమిళంలో ఒక మూవీ, హిందీలో మరో రెండు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో.. రానా ఇండియాకి ఎప్పుడు వస్తాడో తెలియని కన్‌ఫ్యూజన్‌లో ముందే డేట్స్ ఇవ్వలేనని కీర్తీ తప్పుకున్నారని తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu