దక్షిణాది విజయం..’హిందీ’పై వెనక్కి తగ్గిన షా

దక్షిణాది విజయం..'హిందీ'పై వెనక్కి తగ్గిన షా
"Never Asked For Imposing Hindi Over Other Regional Languages": Amit Shah

‘ఒకే దేశం- ఒకే భాష’ అంటూ దేశం మొత్తం ‘హిందీ’ రుద్దేలా టెస్ట్ ట్రైలర్ వదిలారు దేశ హోం మంత్రి అమిత్ షా. హిందీ ఒక్కటే దేశాన్ని ఏకం చేయగలదంటూ కాస్త గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. ఇది భాషా వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లయ్యింది. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలు భగ్గుమన్నాయి. తమిళనాడులో అయితే తీవ్ర స్థాయిలో నిరసనలు మొదలయ్యాయి. డీఎంకే, ఏఐడిఎంకే పార్టీలు కేంద్రం ప్రకటన ఉపసంహరించుకునేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని […]

Ram Naramaneni

|

Sep 18, 2019 | 9:15 PM

‘ఒకే దేశం- ఒకే భాష’ అంటూ దేశం మొత్తం ‘హిందీ’ రుద్దేలా టెస్ట్ ట్రైలర్ వదిలారు దేశ హోం మంత్రి అమిత్ షా. హిందీ ఒక్కటే దేశాన్ని ఏకం చేయగలదంటూ కాస్త గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. ఇది భాషా వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లయ్యింది. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలు భగ్గుమన్నాయి. తమిళనాడులో అయితే తీవ్ర స్థాయిలో నిరసనలు మొదలయ్యాయి. డీఎంకే, ఏఐడిఎంకే పార్టీలు కేంద్రం ప్రకటన ఉపసంహరించుకునేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించాయి. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా అమిత్ షా ప్రకటనను తప్పుపట్టారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సెల్ యాక్టర్ కమల్ హాసన్, జాతీయ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ‘షా’ వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు. ఆందోళనల ఉదృతం అవుతోన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివరణ ఇచ్చారు. హిందీని కేవలం ద్వితీయ భాషగా మాత్రమే నేర్చుకోవాలని తాను సూచించానని పేర్కొన్నారు. దీనిపై కొందరు అనవసర రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు.

”నేను కేవలం హిందీ భాషను మాత్రమే నేర్చుకోవాలని చెప్పలేదు. మాతృభాష తర్వాత హిందీని కూడా రెండో భాషగా మాత్రమే నేర్చుకోవాలని సూచించా. నేను కూడా హిందీ మాట్లాడని గుజరాత్‌ రాష్ట్రం నుంచి వచ్చా. దీనిపై కొందరు రాజకీయం చేయాలనుకుంటున్నారు. అది వారిష్టం” అని అమిత్‌షా అన్నారు.

ఇటీవల హిందీ దివస్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేస్తూ.. ”అంతర్జాతీయంగా భారత్‌కు విశిష్ట గుర్తింపు ఉండేలా దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలి. మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ వల్లే అది సాధ్యం. భారతదేశం అనేక భాషలకు నిలయం. ప్రతి భాషకూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే భారతీయులందరినీ ఐక్యంగా ఉంచాలంటే ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉంది” అని షా పేర్కొన్నారు.

అమిత్ షా వివరణ ఇవ్వడంతో.. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా డీఎంకే తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రెసిడెంట్ స్టాలిన్ వాయిదా వేశారు.

అసలు దేశంలో ఉన్న భాషలను ఎంతశాతం మంది మాట్లాడాతారో తెలుసుకుందాం: 

హిందీ : 43.63 శాతం

బెంగాళీ : 8.03 శాతం

మరాఠి : 6,.86 శాతం

తెలుగు : 6.7 శాతం

తమిళం : 5. 7 శాతం

కాగా దేశవ్యాప్తంగా 44శాతం మందికి హిందీ మాతృభాషగా ఉంది.  మిగతా మెజార్టీ వర్గం వారి..వారి ప్రాంతీయ భాషల్లో మాట్లాడుకుంటారు. కాగా యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇప్పుడు అందరికి ఉపయోగకరంగా ఉంది. హిందీ మాట్లాడేవారికన్నా..ఇంగ్లీష్ మాట్లాడే మహిళలు 22 శాతం ఎక్కువ సంపాదిస్తున్నారు. అదే విధంగా హిందీ మాట్లాడేవారికన్నా..ఇంగ్లీషు మాట్లాడే పురుషులు 34 శాతం ఎక్కువ సంపాదిస్తున్నారు.

కాగా దేశంలో నెమళ్లు కంటే కాకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాకిని జాతీయ పక్షి చేద్దామా?.. పులుల కంటే మిగతా జంతువులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి..వాటిలో ఒకదానిని జాతీయ జంతువుగా ప్రకటించుకోలేదు కదా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. దేశానికి ఏది అవసరమో అది చూడకుండా నియంతృత్వ వాదన పనికిరాదంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే ‘ఒకే దేశం- ఒకే భాష’ తర్వాత జీడీపీ ఉన్నతికి కృషి చేసి భారత్ ఆర్ధిక వృద్దిలోకి తీసుకెళ్లకుండా..ఇలాంటివి పట్టుకోని వేలాడకండంటూ సలహాలు ఇస్తున్నారు.

అమెజాన్ అలెక్సాతో ఇకపై హిందీలోనూ మాట్లాడవచ్చు:

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన డిజిటల్ అసిస్టెంట్ అలెక్సాతో భారత వినియోగదారులు ఇకపై హిందీ లేదా హింగ్లిష్ (హిందీ+ఇంగ్లిష్)లోనూ మాట్లాడవచ్చు. మ్యూజిక్, బాలీవుడ్, స్పోర్ట్స్ అప్‌డేట్స్ తదితర వివరాలను హిందీలో అలెక్సాను అడిగి తెలుసుకోవచ్చు. హిందీ లేదా హిందీ, ఇంగ్లిష్ కలిపిన హింగ్లిష్ భాషలోనూ అలెక్సాను ఆ వివరాలు అడగవచ్చు. ఈ క్రమంలోనే అమెజాన్ అలెక్సా ఉన్న అన్ని అమెజాన్ ఎకో డివైస్‌లలోనూ ఈ నూతన సౌకర్యం వినియోగాదారులకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. భారత్ తాజా సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 53 కోట్ల మంది హిందీ మాట్లాడుతున్నారని..వారి సౌలభ్యం కోసమే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని అమెజాన్ పేర్కుంది. కాగా తాజా ‘హిందీ’పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu