మోదీతో దీదీ భేటి

మోదీతో దీదీ భేటి
Non-political, fruitful meeting: Mamata meets PM Modi, invites him to Bengal

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ బుధవారం భేటీ అయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆమె నేడు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని స్వీట్లు, కుర్తాను కానుకగా ఇచ్చారు. భేటీలో భాగంగా పశ్చిమబెంగాల్‌ పేరు మార్పు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలను ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా.. త్వరలో పశ్చిమ బెంగాల్‌లో మెగా కార్యక్రమానికి భాజపా సన్నాహాలు చేస్తోంది. ఈ సమయంలో దీదీ ప్రధానిని కలవడం […]

Ram Naramaneni

|

Sep 18, 2019 | 9:47 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ బుధవారం భేటీ అయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆమె నేడు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని స్వీట్లు, కుర్తాను కానుకగా ఇచ్చారు. భేటీలో భాగంగా పశ్చిమబెంగాల్‌ పేరు మార్పు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలను ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా.. త్వరలో పశ్చిమ బెంగాల్‌లో మెగా కార్యక్రమానికి భాజపా సన్నాహాలు చేస్తోంది. ఈ సమయంలో దీదీ ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక.. కోల్‌కతా మాజీ పోలీసు కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. దీంతో ఆయన అరెస్టును ఆపేందుకే మమతాబెనర్జీ ప్రధానిని కలుస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మోదీతో మీటింగ్‌పై లో ప్రొఫైల్‌ మెయింటైన్ చేయడానికి దీదీ ప్రయత్నిస్తున్నప్పటికీ రచ్చ మాత్రం రాజుకుంది. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. మోదీపై దీదీ చేసిన వ్యాఖ్యలు, ఆమె వ్యవహరించిన తీరే అందుకు కారణం. దాదాపు రెండేళ్లుగా మోదీపై దీదీ తీవ్ర విమర్శలు చేశారు. విపక్షాలతో జట్టు కట్టి మోదీని గద్దె దింపుతామని ప్రతిజ్ఞ చేశారు. తుపాను పై సమీక్షకు కూడా హాజరు కాలేదు. నీతి ఆయోగ్ మీటింగ్‌‌కు డుమ్మా కొట్టారు. అస్సలు మోదీ పేరెత్తితేనే భగ్గున మండిపోయేవారు. అలాంటిది ఒక్కసారిగా ఆమె యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

శారదా స్కామ్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ పీకల్లోతుల్లో కూరుకుపోయింది. టీఎంసీకి చెందిన చోటా మోటా నాయకులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ టార్గెట్ చేసింది. ఆయన్ను అరెస్టు చేసి ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీబీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఏమి మాట్లాడలేదని మమత చెబుతున్నప్పటికి..వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu