మోదీ విమానానికి నో ఎంట్రీ.. పగతో రగిలిపోతున్న పాక్

మోదీ విమానానికి నో ఎంట్రీ.. పగతో రగిలిపోతున్న పాక్
Won't Allow PM Modi To Use Our Airspace, Says Pakistan Foreign Minister

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఎల్‌వోసీ వెంబడి చెలరేగుతూనే..భారత్‌ను రెచ్చగొడుతోంది. అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టేందుకు కుట్ర చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌తో సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సంఝౌతా, థార్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దుచేసిన పాక్.. లాహోర్-ఢిల్లీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేసింది. తాజాగా  ప్రధాని మోదీ న్యూయార్క్ పర్యటనను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. మోదీ కార్యక్రమానికి ట్రంప్ కూడా హాజరుకానుండడంతో భరించలేకపోతోంది. ఈ క్రమంలోనే భారత్‌పై అక్కసుతో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. తమ గగనతలంలో […]

Ram Naramaneni

|

Sep 18, 2019 | 10:16 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఎల్‌వోసీ వెంబడి చెలరేగుతూనే..భారత్‌ను రెచ్చగొడుతోంది. అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టేందుకు కుట్ర చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌తో సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సంఝౌతా, థార్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దుచేసిన పాక్.. లాహోర్-ఢిల్లీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేసింది. తాజాగా  ప్రధాని మోదీ న్యూయార్క్ పర్యటనను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. మోదీ కార్యక్రమానికి ట్రంప్ కూడా హాజరుకానుండడంతో భరించలేకపోతోంది. ఈ క్రమంలోనే భారత్‌పై అక్కసుతో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. తమ గగనతలంలో మోదీ ప్రయాణించే విమానానికి అనుమతివ్వబోనని పాక్ అధికారులు స్పష్టం చేశారు.

న్యూయార్క్ పర్యటన నేపథ్యలో పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్లేందుకు అనుమతివ్వాలని భారత అధికారులు వారిని కోరారు. ఇండియా అభ్యర్థనపై స్పందించిన పాక్ కేంద్ర విదేశాంగ మంత్రి మోదీ విమానానికి అనుమతిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.  పాక్ విదేశాంగమంత్రి ఖురేషి అనుమతి నిరాకరించినట్లుగా ప్రకటించి భారత రాయబార కార్యాలయానికి కూడా తెలియజేశారు. అయితే అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ నిబంధనలకు కట్టుబడిఉంటానని ఒప్పందం చేసుకున్న పాక్.. ప్రధాని విమానానికి అనుమతి నిరాకరణతో నిబంధనలు ఉల్లగించినట్లే అవుతుంది. మరి దీనిపై ఐసీఏఓ ఎలా స్పందిస్తుందో చూడాల్సిఉంది. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు దేశాల పర్యటన సందర్భంలో కూడా పాక్‌ అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు పాక్‌ గగనతలాన్ని మూసివేసినప్పటికీ మళ్లీ పునరుద్ధరించింది.

భారత్ నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే విమానాలు పాక్ గగన తలం మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. రోజూ 50 ఎయిర్ ఇండియా విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంటాయి. తమ గగనతలం మీదుగా భారత విమానాలను పాకిస్తాన్ నిషేధం విధిస్తే..ఆ విమానాలన్నీ అరబ్ దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే విమానాలకు దూరం పెరగడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu