‘మిస్ ఇండియా’గా రాబోతున్న మహానటి…ఎప్పుడంటే..

సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటిలో లీడ్ రోల్ పోషించిన కీర్తి సురేష్...అద్భుత నటనతో అందరి మనన్నలు పొందింది. ఈ మలయాళీ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్‌ ఇండియా’. ఈ సినిమా విడుదల తేదీని..

‘మిస్ ఇండియా’గా రాబోతున్న మహానటి...ఎప్పుడంటే..
Follow us
Jyothi Gadda

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 09, 2020 | 3:00 PM

తెలుగు సినిమా కీర్తిని దేశానికి మరోసారి చాటిచెప్పిన ‘మహానటి’ కీర్తి సురేష్. సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటిలో లీడ్ రోల్ పోషించిన కీర్తి..అద్భుత నటనతో అందరి మనన్నలు పొందింది. సావిత్రిగా మెప్పించిన కీర్తి సురేష్.. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం గెలిచి చరిత్ర సృష్టించింది. మహానటి తర్వాత తెలుగులో మన్మథుడు-2 సినిమాలో మాత్రమే కీర్తి సురేష్ నటించింది. ఐతే అందులో గెస్ట్ రోల్‌కే ఆమె పరిమితమైంది.

అయితే, ఇప్పుడు ఈ మలయాళీ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్‌ ఇండియా’. విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఏప్రిల్‌ 17న సినిమా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర యూనిట్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు…. ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర​ ప్రసాద్‌, నరేష్‌​, భాను శ్రీ మెహ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ‘‘మేము ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ మ్యాజిక్‌ ఉంటుంది. మా టీం అందరి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అంటూ కీర్తి ఆదివారం ట్వీట్‌ చేశారు.