కీర్తి సురేష్ ఆ నిర్ణయం తీసుకుందా ?

కీర్తి సురేష్ ఆ నిర్ణయం తీసుకుందా ?

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‍ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె నటన స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. 

Ram Naramaneni

|

Nov 08, 2020 | 7:56 PM

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‍ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె నటన స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.  ఆమెను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అయితే వరసగా రెండు డిజాస్టర్లు ఇచ్చి అభిమానులను నిరాశపరిచింది ఈ మద్దుగుమ్మ. మహానటి అనంతరం అగ్ర హీరోలతో సినిమాలలో నటించే అవకాశం వచ్చినప్పటికీ, కీర్తి మాత్రం మహీళా ప్రాధాన్యమున్న చిత్రాలకే పచ్చ జెండా ఊపింది. అవి రీసెంట్‌గా ఓటీటీ వేదికగా రిలీజయ్యాయి.  ‘పెంగ్విన్‍’ ప్లాప్ నుంచి తేరుకోకముందే… కీర్తి నటించిన ‘మిస్‍ ఇండియా’ చిత్రానికి కూడా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇక నుంచి మ‌హిళా ప్ర‌ధాన క‌థాంశాల‌తో వ‌చ్చే స్టోరీలకు దూరంగా ఉండాల‌ని ఫిక్స్ అయింద‌ట‌. త‌న పాపులారిటీని ప‌దిలంగా ఉంచుకోవడానికి ఇక మీద‌ట స్టార్ హీరోల సినిమాలు చేయాల‌నుకుంటుంద‌ని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కీర్తిసురేశ్ ప్ర‌స్తుతం ప‌రశురాం డైరెక్ష‌న్ లో మ‌హేశ్ బాబు హీరోగా న‌టిస్తోన్న  ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రోవైపు వేదాలం రీమేక్ లో చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది‌.  ఇక కీర్తి తదుపరి సినిమాలు ‘గుడ్‍లక్‍ సఖి’, ‘రంగ్‍ దే’ కూడా ఓటిటి ద్వారా విడుదలకు రెడీగా ఉన్నాయి.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

తెలుగు పరిశ్రమ నాకు ప్రాణ సమానం : పూజా హెగ్డే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu