పాక్ లీగ్‌లో రేర్ సీన్.. బ్యాట్స్‌మెన్ కాళ్లు పట్టుకున్న వికెట్ కీపర్!
పాకిస్థాన్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఫన్నీ సన్నివేశాలకి ప్రతిరూపంగా మారిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి తికమక రనౌట్లు, కామెడీ తరహాలో క్యాచ్‌లు వదిలేయడాలు, బ్యాట్స్‌మెన్ తల నుంచి పొగలు రావడం
PSL: పాకిస్థాన్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)కామెడీ సన్నివేశాలకి ప్రతిరూపంగా మారిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి తికమక రనౌట్లు, క్యాచ్‌లు వదిలేయడాలు, హిట్టర్ క్రిస్ లిన్ తల నుంచి పొగలు రావడం ఇలా పీఎస్‌ఎల్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ వాల్టన్ ఓ సులువైన క్యాచ్‌ని వదిలేసి.. ఆ వెంటనే బ్యాట్స్‌మెన్ కాళ్లు పట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది.
కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ జట్టులో అలెక్స్ హేల్స్ (80: 48 బంతుల్లో 6×4, 5×6), వాల్టన్ (45: 20 బంతుల్లో 2×4, 5×6) సిక్సర్ల మోత మోగించారు. అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని లాహోర్ టీమ్ 19.1 ఓవర్లలోనే 190/2తో ఛేదించేసింది. ఓపెనర్ సొహైల్ అక్తర్ (68: 46 బంతుల్లో 6×4, 2×6) ఛేదనలో లాహోర్ టీమ్‌కి మెరుపు ఆరంభాన్నివ్వగా.. ఆఖర్లో బెన్ డక్ (99 నాటౌట్: 40 బంతుల్లో 3×4, 12×6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కానీ.. అతను శతకం ముంగిట ఆగిపోయాడు.
అయితే.. బెన్ డక్ 10వ ఓవర్‌లోనే ఔటవ్వాల్సింది. మీడియం పేసర్ డెల్‌ఫోర్ట్ విసిరిన బంతిని రివర్స్ స్వీప్ ద్వారా బౌండరీకి తరలించేందుకు డక్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి అలానే గాల్లోకి లేచింది. దీంతో డక్ తలపై గాల్లోకి లేచిన బంతిని అందుకునేందుకు వికెట్ కీపర్ వాల్టన్ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ.. బంతి నేరుగా వచ్చి డక్ హెల్మెట్‌పై పడి కిందకి జారుతుండటంతో.. దాన్ని అలానే పట్టుకోవాలని ఆశించిన వాల్టన్ మెకాళ్లపై కూర్చుని క్రీజులో ఉన్న డక్‌ని గట్టిగా హత్తుకున్నాడు. వాల్టన్ తన కాళ్లని గట్టిగా పట్టుకోవడంతో డక్ కూడా ఎక్కడికీ కదల్లేకపోయాడు.
[svt-event date=”09/03/2020,5:47PM” class=”svt-cd-green” ]
BEN DUNK IS CHADWICK WALTON’S LONG-LOST BROTHER ?
This is Walton’s world and we are living in it! #HBLPSLV #TayyarHain #CricketForAll pic.twitter.com/38nJEHCLJr
— Cricingif (@_cricingif) March 8, 2020
[/svt-event]
[svt-event date=”09/03/2020,5:47PM” class=”svt-cd-green” ]
Chris Lynn’s was so angry that his head was literally burning! ?? #PSL2020 pic.twitter.com/vNj6hyGtRM
— SALIYA (@Saliya969) February 29, 2020
[/svt-event]