AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్ మండే.. వణికిన దలాల్ స్ట్రీట్.. 7 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి, రష్యా, సౌదీ అరేబియా మధ్య చమురు ధరలకు సంబంధించి సాగుతున్న పైస్ వార్.. కారణంగా దేశీయ మార్కెట్ కుదేలయింది.

బ్లాక్ మండే.. వణికిన దలాల్ స్ట్రీట్.. 7 లక్షల కోట్లు ఆవిరి
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 09, 2020 | 6:04 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి, రష్యా, సౌదీ అరేబియా మధ్య చమురు ధరలకు సంబంధించి సాగుతున్న పైస్ వార్.. కారణంగా దేశీయ మార్కెట్ కుదేలయింది. ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్ వణికిపోగా..ఇన్వెస్టర్ల ఆందోళన భారీ అమ్మకాలకు తెర తీసింది. సెన్సెక్స్ లో దాదాపు 800 కి పైగా షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి దిగజారగా.. బ్యాంకింగ్, ఆటో, ప్రైవేటు రంగ ఆయిల్ షేర్లు నష్టాలను మూట గట్టుకున్నాయి. ఒక్క రోజే రూ. 7 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీ ఎస్ ఈ లో 13.65 శాతం పతనం కాగా.. పది లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ లో 2.7 లక్షల కోట్లు హరించుకుపోయాయి. సెన్సెక్స్ 1942 పాయింట్ల మేర, నిఫ్టీ 538 పాయింట్ల మేర నష్టపోయాయి. బ్లాక్ మండే గా దీన్ని అభివర్ణిస్తున్నారు. లండన్ మార్కెట్లో 140 బిలియన్ పౌండ్లు ఆవిరైపోయాయి. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. 1991 లో గల్ఫ్ యుధ్ధం అనంతరం గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు ఇంతగా పతనం  కావడం ఇదే మొదటిసారి. ‘మార్కెట్స్ బ్లడ్ బాత్’ అని కూడా ఈ పరిణామాన్ని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.

Follow Us
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే