దుబ్బాక మాదే.. విపక్షాలది యాగే..!
మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉప ఎన్నికలో తమదే విజయమంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్. విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయి కానీ.. టీఆర్ఎస్ పార్టీ విజయం ఆల్ రెడీ ఖాయమైందన్నది ఆయన ధీమా.

KCR confidence on dubbaka victory: ప్రస్తుతం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉప ఎన్నికలో గులాబీ దళానిదే ఘనవిజయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసలీ ఉప ఎన్నిక తమకు లెక్కే కాదన్నారాయన. మంచి మెజారిటీ గెలుస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే టీఆర్ఎస్ విజయం ఖాయమైందని, అందుకే విపక్షాలు అనవసర యాగీ చేస్తున్నాయని వ్యాఖ్యానించారు సీఎం.
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరుగుతున్న ఎన్నికలో ఆయన సతీమణి సుజాతమ్మకే అధికార పార్టీ టిక్కెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గత నాలుగైదు రోజులుగా దుబ్బాకలో రాజకీయం మితిమీరుతోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉప ఎన్నికను రక్తి కట్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దుబ్బాక ఉప ఎన్నికలో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి విజయం ఆల్‌రెడీ ఖాయమైందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విపక్షాల రాద్ధాంతాన్ని నమ్మే పరిస్థితిలో దుబ్బాక ఓటర్లు లేరని ఆయనంటున్నారు.
Also read: చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త
Also read: ధరణీ పోర్టల్ సీక్రెట్ వెల్లడించిన కేసీఆర్
Also read: నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే
Also read: ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా
Also read: అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్



