బ్రేకింగ్ః హోం ‌ఐసోలేషన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు.

బ్రేకింగ్ః హోం ‌ఐసోలేషన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 13, 2020 | 8:24 PM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్టర్ వేదిక స్వయంగా వెల్లడించారు. తనకు రాపిడ్ టెస్ట్ లో నెగటివ్ రాగా, RTPCR టెస్టులో కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు కొవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎన్నికైన కవిత బుధవారం మండలి సమావేశం సందర్భంగా ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణం చేయాల్సి ఉంది.