AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యకు సమానంగా కోలుకుంటున్నవారి సంఖ్య సరి సమానంగా ఉంటుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

భారత్‌లో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్
Balaraju Goud
|

Updated on: Oct 13, 2020 | 7:58 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యకు సమానంగా కోలుకుంటున్నవారి సంఖ్య సరి సమానంగా ఉంటుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 62లక్షలు దాటిందని, ప్రపంచంలోనే ఇది అత్యధికమని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. ప్రస్తుతం క్యుమిలేటివ్‌ పాజిటివిటీ రేటు 8.07శాతం నమోదు కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.24శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 5.16శాతంగా ఉందని తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై మీడియా సమావేశంలో మాట్లాడారు.

వరుసగా ఐదో రోజూ యాక్టివ్‌ కేసుల సంఖ్య 9లక్షల కంటే తక్కువగానే ఉందని, యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 62,27,296 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 8,38,729 క్రియాశీలక కేసులు ఉన్నాయి. వారంతా వివిధ ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇక ఇప్పటివరకు 1,09,856 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,89,45,107 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది.

Follow Us
పుచ్చకాయను సులభంగా కోసే జపనీస్ టెక్నిక్.. ఇలా ప్రయత్నించండి
పుచ్చకాయను సులభంగా కోసే జపనీస్ టెక్నిక్.. ఇలా ప్రయత్నించండి
అమ్మో నిమ్మ..! ఇటు కొనలేం.. అటు తాగలేం.. ఎండల్లో షాకిస్తున్న ధరలు
అమ్మో నిమ్మ..! ఇటు కొనలేం.. అటు తాగలేం.. ఎండల్లో షాకిస్తున్న ధరలు
వాట్సప్‌ వాడేవారికి షాకింగ్.. త్వరలో సబ్‌స్క్రిప్షన్ మోడల్..
వాట్సప్‌ వాడేవారికి షాకింగ్.. త్వరలో సబ్‌స్క్రిప్షన్ మోడల్..
బ్లాక్ బస్టర్ 'బద్రి'కి 26 ఏళ్లు.. రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
బ్లాక్ బస్టర్ 'బద్రి'కి 26 ఏళ్లు.. రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
ఈ నేచురల్ ఫేస్ ప్యాక్‌తో మిలమిల మెరిసే చర్మం మీసొంతం
ఈ నేచురల్ ఫేస్ ప్యాక్‌తో మిలమిల మెరిసే చర్మం మీసొంతం
మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో
మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో
మీ ఎయిర్ కూలర్‌ను ఏసీలా మార్చేయండి!జస్ట్‌ 5 రూపాయలతో కూల్ కూల్ గా
మీ ఎయిర్ కూలర్‌ను ఏసీలా మార్చేయండి!జస్ట్‌ 5 రూపాయలతో కూల్ కూల్ గా
ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే
ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే
దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఓటీటీలో అస్సలు మిస్సవ్వొద్దు
దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఓటీటీలో అస్సలు మిస్సవ్వొద్దు
అధిక మాసంలో ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే!
అధిక మాసంలో ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే!