AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్‌కు భారీ నష్టం..ఆర్టికల్‌ 370 రద్దు ప్రభావం

కశ్మీర్‌పై ఆర్టికల్‌ 370 రద్దు ప్రభావం పడిందా..? వేల కోట్ల నష్టం వాటిల్లిందా..? అంటే అవుననే అంటోంది కశ్మీర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ రిపోర్ట్‌. ఆర్టికల్‌ 370 రద్దు చేసి జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా తొలగించిన 2019 ఆగస్ట్‌ 5 నుంచి ఇప్పటివరకు..అంటే ఈ 4 నెలల్లో కశ్మీర్‌ తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిగిన పరిణామాలతో..ఈ 120 రోజుల్లోభారీ నష్టం వచ్చినట్లు వెల్లడించింది కేసీసీఐ నివేదిక. నష్టాలను […]

కశ్మీర్‌కు భారీ నష్టం..ఆర్టికల్‌ 370 రద్దు ప్రభావం
Pardhasaradhi Peri
|

Updated on: Dec 18, 2019 | 8:37 PM

Share

కశ్మీర్‌పై ఆర్టికల్‌ 370 రద్దు ప్రభావం పడిందా..? వేల కోట్ల నష్టం వాటిల్లిందా..? అంటే అవుననే అంటోంది కశ్మీర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ రిపోర్ట్‌. ఆర్టికల్‌ 370 రద్దు చేసి జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా తొలగించిన 2019 ఆగస్ట్‌ 5 నుంచి ఇప్పటివరకు..అంటే ఈ 4 నెలల్లో కశ్మీర్‌ తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిగిన పరిణామాలతో..ఈ 120 రోజుల్లోభారీ నష్టం వచ్చినట్లు వెల్లడించింది కేసీసీఐ నివేదిక.

నష్టాలను అంచనా వేయడానికి రెండు పద్ధతులను ఉపయోగించినట్లు కెసిసిఐ తెలిపింది. మొదటిది 2017-18 స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా నష్టాన్ని అంచనా వేసినట్లు వెల్లడించింది. ఈ పద్ధతిలో సుమారు 55శాతం జనాభా కలిగిన 10 జిల్లాల్లో అధ్యయనం చేసి 17878వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. రెండవ పద్ధతి ప్రకారం వివిధ రంగాల వారీగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. ఆర్టికల్‌ 370 రద్దుతో సంస్థలు మూతబడుతున్నాయని..లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని..లోయలోని ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రుణాలు చెల్లించే పరిస్థితులు లేవని..తద్వారా దివాలా తీసే పరిస్థితులేర్పడ్డాయని..ఇప్పటికే చాలా సంస్థలు మూతబడ్డాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు ఆస్తుల అమ్మకం మరియు దివాలా వైపు దారితీస్తున్నాయని పేర్కొంది.

కశ్మీర్‌లోని 10 జిల్లాల్లో 11ప్రధాన రంగాల్లో ప్రతిరోజూ 119 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయిట్లు తెలిపింది నివేదిక. దీని ప్రకారం 17800 కోట్ల రూపాయల ఆర్థిక నష్టాలను చవిచూసింది. దాదాపు 5 లక్షల ఉద్యోగాలను కోల్పోయింది. పర్యాటకరంగంతో సహా సేవలరంగాలకు 9191 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని..లక్షా 40వేల 5వందల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వచ్చాయని పేర్కొంది. అదే సమయంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ సేవల రంగాల్లో 12000 ఉద్యోగాలు కోల్పోయి రూ .4591 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది. ఇక పరిశ్రమల రంగం ప్రధానంగా తయారీ మరియు నిర్మాణరంగాలు 4095 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని.. 70,000 మంది జాబ్స్‌ కోల్పోతున్నట్లు వెల్లడించింది.

ఉద్యానరంగానికి 8 వేల కోట్లు కేటాయించడంతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం పోయింది. దీని వల్ల యాఫిల్‌ ధరల మధ్య గందరగోళమేర్పడి రైతులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపింది. నష్టాలను అంచనా వేయడానికి లేదా నిస్సహాయ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని తెలిపింది కేసీసీఐ నివేదిక. పర్యాటక రంగం గందరగోళంలో ఉందని..చేతి వృత్తులవారు, నేత కార్మికులు నిరుద్యోగులుగా మారుతున్నారని స్పష్టం చేసింది. తయారీ రంగం సుమారు 2,520 కోట్ల నష్టంతో పూర్తిగా దెబ్బతిందని నివేదిక పేర్కొంది.