AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“టీ సెల్స్”తో కరోనాకి చెక్..?

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను జయించే శక్తి మానవులకు ఉందని స్వీడన్ సైటింస్టులు చెబుతున్నారు. మనషుల్ల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండింతల మందిలో ఉందని మానవ శరీరంలోన టీ సెల్స్‌ను పరిశీలించడం ద్వారా రుజువైందని కరోలిన్‌స్కా పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

టీ సెల్స్తో కరోనాకి చెక్..?
Balaraju Goud
|

Updated on: Jul 01, 2020 | 8:15 PM

Share

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను జయించే శక్తి మానవులకు ఉందని స్వీడన్ సైటింస్టులు చెబుతున్నారు. మనషుల్ల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండింతల మందిలో ఉందని మానవ శరీరంలోన టీ సెల్స్‌ను పరిశీలించడం ద్వారా రుజువైందని కరోలిన్‌స్కా పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనావైరస్ నుండి కోలుకున్నవారిలో రోగనిరోధక శక్తి మొదట ఉన్నదానికంటే రెండు రెట్లు అధికంగా ఉండవచ్చంటున్నారు. మన శరీరం వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే విధానాన్ని పరిశీలించిన తరువాత ఈ విషయం వెల్లడైందన్నారు. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే తెల్లరక్తం కణాల సమూహన్ని “టీ సెల్స్‌” గా పిలుస్తారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న రోగుల్లో ఆరోగ్యంగా ఉన్న 30 శాతం మందిలోని టీ సెల్స్‌ రోగ నిరోధక శక్తి పెరిగిందని, కరోనాను కట్టడి చేసేందుకు ఎంత శక్తి కావాలనేది ఇంకా సరియైన స్పష్టత రాలేదని నిపుణుల బృందం తెలిపింది. ఆ 30 శాతం మందిలో కరోనా రోగ లక్షణాలు కూడా కనిపించలేదని వారు చెప్పారు. కరోనా బారిన పడిన చిన్నపిల్లలు కోలుకోవడానికి టీ–సెల్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయని, పిల్లల్లో అవి క్రియాశీలకంగా ఉంటాయని వైద్యులు వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం యూరప్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించని ఏకైక దేశం స్వీడన్‌. అయినప్పటికి గత వారం రోజుల్లో కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య పది శాతం తగ్గింది. స్వీడన్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 68,451లకు చేరుకోగా మృతుల సంఖ్య 5,333 చేరుకుంది. అయితే, ప్రస్తుతం 54,821 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Follow Us
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!
రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!