AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కేజీఎఫ్’ హీరో అయ్యాడండీ ‘స్వామి’కి టార్గెట్

కేజీఎఫ్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న శాండిల్‌వుడ్ నటుడు యశ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వార్నింగ్ ఇచ్చారు. తమలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి నటుల జీవితాలు ముందుకెళ్లవని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక తాను ఒప్పుకుంటానన్న నమ్మకం లేదని కుమారస్వామి అన్నారు. అయితే మాండ్యాలో జరిగే ఉప ఎన్నికల్లో దివంగత నటుడు అంబరీశ్ సతీమణి నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆమెకు ప్రత్యర్థిగా ముఖ్యమంత్రి కుమార […]

‘కేజీఎఫ్’ హీరో అయ్యాడండీ ‘స్వామి’కి టార్గెట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2019 | 2:37 PM

Share

కేజీఎఫ్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న శాండిల్‌వుడ్ నటుడు యశ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వార్నింగ్ ఇచ్చారు. తమలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి నటుల జీవితాలు ముందుకెళ్లవని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక తాను ఒప్పుకుంటానన్న నమ్మకం లేదని కుమారస్వామి అన్నారు.

అయితే మాండ్యాలో జరిగే ఉప ఎన్నికల్లో దివంగత నటుడు అంబరీశ్ సతీమణి నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆమెకు ప్రత్యర్థిగా ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్న నేపథ్యంలో.. సుమలతకు మద్దతుగా యశ్ రంగంలోకి దిగి ప్రచారం ప్రారంభించాడు. ఈ సందర్భంలో జేడీఎస్‌పై విమర్శలు కురిపించడంతో ఆ పార్టీ నేత, సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ‘‘మాలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి జీవితాలు ముందుకెళ్లవు. అలాంటి నటులు తన పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు. తాను నివారిస్తున్నాను కాబట్టే తమ పార్టీ కార్యకర్తలు అతడిపై ఏ కామెంట్ చేయకుండా మౌనంగా ఉన్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

కాగా ఆయన మాటల్ని బట్టి చూస్తే యశ్‌కు నిర్మాతలెవరూ అవకాశాలివ్వొద్దని పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లేనని వార్తలు వస్తున్నాయి. ఓ వైపు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన యశ్, శాండిల్‌వుడ్‌లో టాప్ హీరోగా ఎదగడం.. తన కుమారుడు నిఖిల్ హీరోగా అట్టర్ ఫ్లాప్ కావడం లాంటి విషయాలను మనసులో పెట్టుకునే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారని శాండిల్‌వుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us
తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్..
తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్..
గణేష్ ఉత్సవాల్లో పోలిసుల అదుపులో 2935 మంది పోకిరీలు
గణేష్ ఉత్సవాల్లో పోలిసుల అదుపులో 2935 మంది పోకిరీలు
ఇదెక్కడి కొట్లాట రా సామీ.. కోతుల మధ్య గ్యాంగ్ వార్.. వీడియో
ఇదెక్కడి కొట్లాట రా సామీ.. కోతుల మధ్య గ్యాంగ్ వార్.. వీడియో
పితృ పక్షం.. శ్రాద్ధం ఉదయం ఎందుకు చేయరు? మధ్యాహ్నమే ఎందుకు..
పితృ పక్షం.. శ్రాద్ధం ఉదయం ఎందుకు చేయరు? మధ్యాహ్నమే ఎందుకు..
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...