నగ్మాకు కంగనా టీమ్ స్ట్రాంగ్ కౌంటర్

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కూడా ఈ వివాదాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా సీనియర్‌ నటి నగ్మా..

నగ్మాకు కంగనా టీమ్ స్ట్రాంగ్ కౌంటర్
Sanjay Kasula

|

Jul 24, 2020 | 8:59 AM

Kangana Ranaut’s Team Reacts to Nagma’s Meme : బాలీవుడ్‌లో ముద్దుగుమ్మల మాటల యుద్ధం రంజుగా మారింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం గురించి రోజుకో చర్చ, వివాదం రేపుతోంది. పలువురు తారలు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కూడా ఈ వివాదాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా సీనియర్‌ నటి నగ్మా కూడా కంగనాపై కామెంట్స్‌ చేశారు. కంగనా దీదీ కెరీర్‌ మొత్తం నెపోటిజం అనే పిల్లర్‌ మీదే ఆధారపడి ఉందా…? ఎవరి సపోర్ట్‌ లేకుండానే బాలీవుడ్‌లో ఆమె ఈ స్థాయికి చేరుకుందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

అంతేకాకుడా కొన్ని మీమ్స్‌ చేసి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అక్కడితో ఆగకుండా.. కంగనాను బాలీవుడ్‌కి పరిచయం చేసిన ఆదిత్యా పంచోలి, ‘గ్యాంగ్‌స్టర్‌’తో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన మహేశ్‌భట్‌ కూడా బంధుప్రీతితోనే అవకాశం ఇచ్చారా? అని నగ్మా ప్రశ్నించారు. కంగనా కెరీర్‌ డౌన్‌ అయిన రెండు సందర్భాల్లో హృతిక్‌ రోషన్‌ రీ- లాంచ్‌ చేయడం కూడా నెపోటిజమేనా..? అని ఆమె అడిగారు.

ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కంగనా రనౌత్‌ డిజిటల్‌ టీమ్‌… నగ్మా కామెంట్స్‌తో మరింత మండింది. ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది. నగ్నా విసిరిన ప్రతీ ప్రశ్నకు రివర్స్ కౌంటర్ ఇచ్చింది. నగ్మాజీ ఆదిత్యా పంచోలి కంగనాకు బాయ్‌ఫ్రెండ్‌ కాదు అంటూ మొదలు పెట్టి… కెరీర్‌ బిగినింగ్‌లో మెంటర్‌గా ఉన్నమాట వాస్తవం.

ఆ తర్వాత తనను హింసించే వ్యక్తిగా మారాడని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆడిషన్స్‌ సమయంలో కూడా పంచోలి కంగనాను కొట్టి హింసించాడన్న విషయం మీరు తెలుసుకోవాలి…! డబ్బు కోసం పెళ్లి వేడుకల్లో డాన్స్‌ చేసే అలవాటు కంగనాకు లేదంటూ సెటైర్లు సందించింది డిజిటల్ టీమ్. అందుకే బాలీవుడ్‌లో ఏ ఏజెన్సీ కూడా ఆమెను హైర్‌ చేసుకోలేదని.. ఆ సమయంలో ఆమె సోదరి రంగోలి తనకు మేనేజర్‌గా పనిచేశారని గుర్తు చేశారు. ‘కైట్‌’ సినిమాలో కంగనా పాత్ర తగ్గడంతో కలత చెంది ‘క్రిష్‌ 3’ చేయడానికి మొదట అంగీకరించలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ‘గ్యాంగ్‌స్టర్‌’ సమయంలో నెపోటిజం ఉండకపోవచ్చు. ఇప్పుడైతే అన్ని రంగాల్లోనూ నెపోటిజం ఉంది. సీనియర్‌ నటిగా, రాజకీయ నాయకురాలిగా సొసైటీలో పేరున్న మీరు కూడా ఇలా అసత్యాలను ప్రచారం చేయడం బాధాకరమని కంగనా డిజిటల్‌ టీమ్‌ నగ్మాకు కౌంటర్‌గా వరుస ట్వీట్లు చేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu