భర్త కంపెనీ కోసం రంగంలోకి దిగిన కాజల్.. త్వరలోనే బ్రాండింగ్ మొదలు పెట్టనున్న చందమామ
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భర్త గౌతమ్ కిచ్లుతో కాజల్ హనీమూన్ ఎంజాయ్ చేసి ఇటీవలే తిరిగొచ్చింది.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భర్త గౌతమ్ కిచ్లుతో కాజల్ హనీమూన్ ఎంజాయ్ చేసి ఇటీవలే తిరిగొచ్చింది. ఈ బ్యూటీ మాల్దీవుల్లో వయ్యారాలుపోతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ అమ్మడు ఇప్పడు భర్త గౌతమ్ కంపెనీకి బ్రాండింగ్ చేస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే భర్త కోసం అదిరిపోయే ఎండోర్స్‌మెంట్ చేయడానికి రెడీ అయిపోయింది ఈ బ్యూటీ. దీనికోసం కమర్షియల్ యాడ్స్ కూడా చేయబోతుంది కాజల్.
కాజల్ భర్త గౌతమ్ ప్రముఖ డిజైనింగ్ కంపెనీకి అధినేత. ఈయనకు ముంబైలో బిజినెస్ మ్యాన్‌గా మంచి పేరుంది. ఈ క్రమంలో భార్య కాజల్ ఇమేజ్‌ను కూడా తన కంపెనీ కోసం వాడుకుంటున్నాడు గౌతమ్. ఈ సంస్థ త్వరలోనే కాజల్‌తో బ్రాండ్ పబ్లిసిటీకి సంబంధించిన బ్రోచర్లను కూడా విడుదల చేయబోతుంది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో కొన్ని వీడియోస్ కూడా షేర్ చేసింది. ఇదిలా ఉంటే త్వరలో మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న’ఆచార్య’ సినిమా షూటింగ్ లో ఈ అమ్మడు జాయిన్ అవ్వనుంది.