AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ : మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత…

కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజా రాంచందర్ (రాజబాబు) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు ప్ర‌స్తుతం 77 సంవ‌త్స‌రాలు..గ‌త‌ కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న రాంచందర్.. ఆదివారం సాయంత్రం తన స్వగ్రామమైన కొండూరులో క‌న్నుమూశారు. రాజబాబు మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు సేవ చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో కొన‌సాగిన ఆయ‌న‌.. ఇండిపెండెంట్‌గాను విజ‌యం సాధించారు. కైకలూరు నుంచి రెండు సార్లు శాస‌న‌స‌భ‌కు (ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ తరఫున మరోసారి) ఎన్నికయ్యారు. […]

ఏపీ : మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత...
Ram Naramaneni
|

Updated on: May 18, 2020 | 6:34 AM

Share

కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజా రాంచందర్ (రాజబాబు) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు ప్ర‌స్తుతం 77 సంవ‌త్స‌రాలు..గ‌త‌ కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న రాంచందర్.. ఆదివారం సాయంత్రం తన స్వగ్రామమైన కొండూరులో క‌న్నుమూశారు. రాజబాబు మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు సేవ చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో కొన‌సాగిన ఆయ‌న‌.. ఇండిపెండెంట్‌గాను విజ‌యం సాధించారు. కైకలూరు నుంచి రెండు సార్లు శాస‌న‌స‌భ‌కు (ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ తరఫున మరోసారి) ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాంచందర్ టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

1999 ఎన్నికల్లో టీడీపీ ఆయ‌న‌కు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగిన‌ రాజబాబు మంచి మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అధికారంలో ఉన్న‌ టీడీపీని కాదని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేత‌గా కొన‌సాగారు. అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం చ‌విచూశారు. ఆ త‌ర్వాత వైఎస్సార్ మ‌ర‌ణం, త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల వ‌ల్ల‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిన పరిస్థితి నెలకొంది. అయినా రాంచందర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. రాజబాబు మృతికి పలువురు రాజకీయ ప్ర‌ముఖులు సంతాపం ప్రకటించారు.

Follow Us
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?
త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?
డబ్బు సంపాదన గురించి చాణిక్యుడు చెప్పిన 3 సీక్రెట్స్!
డబ్బు సంపాదన గురించి చాణిక్యుడు చెప్పిన 3 సీక్రెట్స్!
ఈ బుడ్డోడిపై శ్రేయస్‌కు ఎందుకంత నమ్మకం?
ఈ బుడ్డోడిపై శ్రేయస్‌కు ఎందుకంత నమ్మకం?