తెలుగు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఎందుకు తప్పుకున్నట్లు..?

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు. ఈ కమిటీలో ఆయనను ఎంపిక చేసినందుకు బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గొగోయ్‌కు రమణ అత్యంత సన్నిహితులని, వారిద్దరూ తరచూ కలుస్తుంటారని బాధితురాలు.. బుధవారం రాత్రి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తోన్న జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు లేఖ రాశారు. అంతేకాదు ఈ కమిటీలో ఒక్క మహిళా […]

తెలుగు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఎందుకు తప్పుకున్నట్లు..?
NV Ramana
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 5:00 PM

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు. ఈ కమిటీలో ఆయనను ఎంపిక చేసినందుకు బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గొగోయ్‌కు రమణ అత్యంత సన్నిహితులని, వారిద్దరూ తరచూ కలుస్తుంటారని బాధితురాలు.. బుధవారం రాత్రి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తోన్న జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు లేఖ రాశారు. అంతేకాదు ఈ కమిటీలో ఒక్క మహిళా న్యాయమూర్తి మాత్రమే ఉండటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ  నేపథ్యంలో ఈ కమిటీ నుంచి రమణ స్వయంగా తప్పుకున్నారు. కాగా ఈ కమిటీలో ఇందిరా బెనర్జీ అనే మహిళా న్యాయవాది కూడా సభ్యురాలిగా ఉన్నారు.