ఆస్పత్రికి తరలించాలన్న పోలీసుల అభ్యర్థన కొట్టివేత, మదనపల్లె జంట హత్యల కేసులో తల్లిదండ్రులకు14 రోజుల రిమాండ్

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన యువతుల తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు..

  • Venkata Narayana
  • Publish Date - 8:31 pm, Wed, 27 January 21
ఆస్పత్రికి తరలించాలన్న పోలీసుల అభ్యర్థన కొట్టివేత, మదనపల్లె జంట హత్యల కేసులో తల్లిదండ్రులకు14 రోజుల రిమాండ్
Madanapalle Incident

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన యువతుల తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. సబ్‌జైలులో అర్థరాత్రి తల్లి పద్మజ హల్‌చల్‌ చేసిన నేపథ్యంలో, నిందితులు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. భార్యాభర్తలిద్దరూ విచారణకు సహకరించడం లేదని, ఫలితంగా ఇద్దరినీ తిరుపతి రుయాకు తరలించాలని మేజిస్ట్రేట్‌ను పోలీసులు కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే, సరైన ఉత్తర్వులు లేకుండా ఎస్కార్ట్ పంపలేమని డీఎస్పీ చెప్పారు. దీంతో సబ్ జైలు అధికారులు తర్జనభర్జనలో పడ్డారు. శివాలయంవీధికి చెందిన మల్లూరు పురుషోత్తంనాయుడు, పద్మజ భార్యాభర్తలు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడ భక్తి వల్ల పూజగదిలోనే పెద్దకుమార్తె అలేఖ్యను పద్మజ.. డంబెల్‌తో నుదిటిపై మోదీ చంపేశారు. చనిపోయిన అలేఖ్యను పూజా క్రతువులో భాగంగా బతికించుకొనేందుకు రెండోకుమార్తె సాయిదివ్యను పైఅంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఇదే తరహాలో భర్త ఎదుటే పద్మజ చంపేసిన సంగతి తెలిసిందే.