AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యంత తక్కువ ధరకే జియో స్మార్ట్‌ఫోన్లు..!

రిలయన్స్ జియో అభిమానులకు గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ప్రతి భారతీయుని చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.

అత్యంత తక్కువ ధరకే జియో స్మార్ట్‌ఫోన్లు..!
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2020 | 9:04 PM

Share

రిలయన్స్ జియో అభిమానులకు గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ప్రతి భారతీయుని చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. ఈ ఏడాది చివరి నాటికి  10 కోట్ల తక్కువ ధర పలికే స్మార్ట్‌ఫోన్‌లను  మార్కెట్లోకి తీసుకురాబోతోందట. ఈ చౌకైన స్మార్ట్‌ఫోన్లను గూగుల్ భాగస్వామ్యంతో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఫోన్‌తో పాటు డేటా ఆఫర్‌ను కూడా అందించనుంది. డేటా ప్యాక్‌లతో కూడిన ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో చివరి వారంలో లాంచింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవి జియో యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ 4 జీ, 5 జీ టెక్నాలజీకి తోడ్పడుతుంది.

ఈ ఏడాది జూలైలో సుమారు రూ.33,102 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లుగా ప్రకటించింది ఆల్ఫాబెట్ కంపెనీ. ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ కంపెనీ గూగుల్ చేత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ను జూలైలో అభివృద్ధి చేస్తున్నామని, దీనిపై రిలయన్స్ 4 జీ, 5 జీ స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేస్తుందని ఆల్ఫా బెట్ కంపెని తెలిపింది.

జియో యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ రాక భారతదేశంలో తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలైన షియోమి, రియల్‌మే, ఒప్పో, వివోలను షాక్‌కు గురవడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు. చైనా కంపెనీలు భారత మార్కెట్‌ను సుమారు రూ.14,713 కోట్ల మేర ఆక్రమించాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్‌ల వాటా సుమారు రూ.7,360 కోట్లు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క టెలికాం ఆర్మ్ జియో గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో తయారు చేయబోయే ఈ 10 కోట్ల తక్కువ-ధర స్మార్ట్‌ఫోన్‌ల తయారీని అవుట్సోర్స్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే చౌకైన 5 జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తీసుకురాబోతున్నట్లు రిలయన్స్ జూలైలోనే వెల్లడించింది.

వీధులు ఊడుస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నెలకు లక్ష రూపాయల జీతం!
వీధులు ఊడుస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నెలకు లక్ష రూపాయల జీతం!
లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!