మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో
రిలయన్స్ జియో వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరంతరాయంగా వినోదాన్ని ఆస్వాదించేందుకు అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు పుల్ డాటా అందించేందుకు సరికొత్త ఫ్లాన్లతో ముందుకు వచ్చింది.
రిలయన్స్ జియో వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరంతరాయంగా వినోదాన్ని ఆస్వాదించేందుకు అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు పుల్ డాటా అందించేందుకు సరికొత్త ఫ్లాన్లతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ దృష్టిలో పెట్టుకుని రిలయన్స్ జియో ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. మొత్తం ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లలోనూ అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, అంతేకాకుండా వినియోగదారులకు ఏడాదిపాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నది. రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 3జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఏడాదిపాటు డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను లభిస్తుంది. ఈ ప్లాన్ గడువు 28 రోజులుగా పేర్కొంది. 56 రోజుల వ్యాలిడిటీతో రూ.598 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఒక సంవత్సరం డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ చందాను అందిస్తున్నట్లు తెలిపింది.
ఇక, రూ.777 తో రీఛార్జ్ చేసుకుంటే 1.5 జీబీ రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాల్స్, వన్ ఇయర్ డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుండగా ప్లాన్ గడువు 84 రోజులకు పొడిగించింది. ఇక, రూ. 2,599 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 2జీబీ రోజువారీ డేటాతో ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో సహా డిస్నీ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వీఐపీ, ప్రీమియం ప్లాన్‌ల సబ్‌స్క్రైబర్లు ఐపీఎల్ 2020 క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు వీలుగా డిస్నీ+హాట్‌స్టార్ ప్రకటించింది. ఇక నుంచి క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఎలాంటి అంతరాయం లేకుండా ఎంజాయ్ చేయవచ్చని జియో తెలిపింది.