Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jewellers: 15 వేల మంది జ్యుయెలరీ విక్రేతలకు ఐటీ నోటీసులు

మోదీ ప్రభుత్వం 2016 నవంబరు 8న కరెన్సీ నోట్లపై నిషేధం విధించిన తరువాత కస్టమర్లకు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు విక్రయించిన 12 మందికి పైగా ఆభరణాల వర్తకులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.

Jewellers: 15 వేల మంది జ్యుయెలరీ విక్రేతలకు ఐటీ నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 28, 2020 | 1:55 PM

మోదీ ప్రభుత్వం 2016 నవంబరు 8న కరెన్సీ నోట్లపై నిషేధం విధించిన తరువాత కస్టమర్లకు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు విక్రయించిన 12 మందికి పైగా ఆభరణాల వర్తకులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ రోజున నెక్లె్‌సలు, ఉంగరాలు వంటి ఆభరణాలతో పాటుగా బంగారం కూడా భారీ పరిమాణంలో విక్రయించినట్టు జైన్‌ అనే వ్యాపారి ఒకరు చెప్పారు.

డీమానిటైజేషన్‌ ప్రకటించిన వెనువెంటనే కొనుగోలుదారులు ఆభరణాల దుకాణాలకు తరలివచ్చారు. వాస్తవ ధర కన్నా చాలా ప్రీమియం ధరకు తాను ఒక్క రోజులోనే మొత్తం బంగారం అమ్మేశానని, రెండు నెలల పాటు కష్టపడితే తప్ప రాని ఆదాయం అందుకున్నానని తెలిపారు. మూడు నెలల క్రితం తనకు ఐటీ నోటీసు అందిందని ఆయన చెప్పారు. నల్లధనంతోనే ప్రజలు బంగారం కొన్నారని, అందుకే ఆ రాత్రి తాను ఆర్జించిన ఆదాయం మొత్తం తిరిగి చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించారని జైన్‌ తెలిపారు.

మరోవైపు, ఆ ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లగా.. అప్పీలు చేయాలంటే భారతీయ చట్టాల ప్రకారం వివాదంలో చిక్కుకున్న సొమ్ము మొత్తంలో 20 శాతం డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, జైన్‌కు అందినట్టుగానే 15 వేల మంది వర్తకులకు కూడా నోటీసులు అందాయని భారతీయ బులియన్‌, ఆభరణాల వ్యాపారుల సంఘం కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు. ఆ రకంగా వ్యాపారులందరి నుంచి ఐటీ అధికారులు కోరుతున్న సొమ్ము సుమారు రూ.50 వేల కోట్లని ఆయన తెలిపారు.