రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్.. ఇక నుంచి ఫ్రీ ఫుడ్!

ఇక నుంచి 'నో బిల్-ద ఫుడ్ ఈజ్ ఫ్రీ' అనే క్యాప్షన్‌తో ప్రయాణికుల్ని ఆకర్షిస్తోంది. దీని ఉద్ధేశ్యం ఏంటంటే.. 'బిల్లు లేకపోతే భోజనం ఉచితం'. సాధారణంగా రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆహార పదార్థాలను కొంటూ..

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్.. ఇక నుంచి ఫ్రీ ఫుడ్!
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 1:57 PM

ఇక నుంచి రైలులో ఫ్రీ ఫుడ్ అంటూ భారత రైల్వే సంస్థ స్పష్టం చేసింది. సాధారణంగా.. రైల్వేలో భోజనం బాగోదని, నాణ్యంగా ఉండదని ప్రయాణికులందరూ కంప్లైంట్స్ చేస్తూనే ఉంటారు. అందులోనూ ఫుడ్‌కి మించి ఎక్కువ ధరలను వసూలు చేస్తారని.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం శాఖ ఫిర్యాదులను కూడా తీసుకుంటూనే ఉంటుంది. అలాగే ఫుడ్ పార్శిల్ తీసుకునేటప్పుడు బిల్ కూడా ఇవ్వరు. బిల్లు కన్నా.. ఎక్కువగా ధరలు ఛార్జ్ చేస్తున్నారనేది కూడా రైల్వే ప్రయాణికుల ప్రధాన ఆరోపణ. అయితే.. బిల్లు కన్నా ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని.. భారతీయ రైల్వే అనేక సార్లు స్పష్టం చేసింది కూడా. అయినా కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.

దీంతో ఈ సమస్యకు రైల్వే సంస్థ పరిష్కారం కనిపెట్టింది. ఇక నుంచి ‘నో బిల్-ద ఫుడ్ ఈజ్ ఫ్రీ’ అనే క్యాప్షన్‌తో ప్రయాణికుల్ని ఆకర్షిస్తోంది. దీని ఉద్ధేశ్యం ఏంటంటే.. ‘బిల్లు లేకపోతే.. భోజనం ఉచితం’. సాధారణంగా రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆహార పదార్థాలను కొంటూ ఉంటారు. కానీ వారు బిల్లు మాత్రం ఇవ్వరు. ఇక నుంచి మీరు కొనే ఆహారానికి బిల్లును ఖచ్చితంగా తీసుకోవాలని.. ఇవ్వని పక్షంలో ఆ ఆహారాన్ని ఉచితంగా తీసుకోవచ్చని భారతీయ రైల్వే సంస్థ తాజాగా ట్వీట్ చేసింది. అయితే ఇది ఎంతవరకూ అమలవుతుందో చూడాలి.

కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?