JC met SEC: ఏపీలో భస్మాసురుడు… జగన్ చాలా తెలివైనవారన్న జేసీ
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన జేసీ ఇంటరెస్టింగ్ కామెంట్స్‌తో అక్కడ సందడి చేశారు.
JC Diwakar Reddy chitchat: మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన జేసీ ఇంటరెస్టింగ్ కామెంట్స్‌తో అక్కడ సందడి చేశారు.
‘‘ రాష్ట్రంలో ఎవ్వరూ ఉండకూడదు.. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు ఒక్కరే ఉండాలి.. త్రిమూర్తులుగా ఒక్కరే ఉండి పోలీసులు ఉంటే సరిపోతుంది.. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడు… తన నెత్తి మీద తానే చేయి పెట్టుకుంటున్నాడు.. ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసు… ’’ మీడియాను కన్‌ఫ్యూజ్ చేశారు జేసీ దివాకర్ రెడ్డి. వివరాలు చెప్పండి సార్ అంటూ మీడియా వెంటపడితే.. ‘‘ మీకు కూడా తెలుసు ’’ అంటూ దాటవేశారాయన.
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగినదేనన్న జేసీ.. దాని వల్ల మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీలో వున్నంత మాత్రాన మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదన్న జేసీ.. ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైన వారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ సామాజిక వర్గం ఉంటుంది.. లేని వారు ఎవరో చెప్పాలి.. అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసి.. అక్కడ్నించి చక్కా వెళ్ళిపోయారు. దాంతో జేసీ అభిమతమేంటో అర్థం కాక విలేకరులు బుర్రలు గోక్కున్నారు.