AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ తో సహా తెగిపడి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో కూలి తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బాలుడి ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..
Telangana News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 14, 2026 | 10:46 PM

Share

వ్యవసాయ బావి కోసం పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రెయిన్‌తో సహా తెగిపడి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన మొగుళ్ళపల్లి మండలం కొరికిశాల గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొరికిశాల గ్రామ శివారులో దేవరావు అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యవసాయ బావిలో పూడిక తొలగించే పనులు జరుగుతున్న సమయంలో క్రేన్ ప్రమాదవశాత్తు తెగి బావిలోకి జారిపడింది. ఈ క్రమంలోనే ముగ్గురు కూలీలు కూడా పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృత చెందిన వారిలో కొరికిశాల గ్రామానికి చెందిన సుకిన దేవారావు, బండారి అభిలాష్ అనే బాలుడితో పాటు, పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడి అనే కూలి ఉన్నాడు. అభిలాష్ అనే బాలుడు ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. మొదటిరోజు పరీక్ష రాసివచ్చిన అనంతరం పూడిక తీత పనులు చూసేందుకు వెళ్లి బావిపైన కూర్చున్నాడు. క్రేన్ తెగిపడుతున్న క్రమంలో పట్టుకునే ప్రయత్నంచేసి తను కూడా అదే బావిలో తెగిపడి ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకుతీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాలపాలైన మరో కూలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకునేలా చేసింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్