నేడే అమరావతికి పవన్ కళ్యాణ్.. పార్టీ ఓటమిపై నేతలతో సమీక్షలు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి రానున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అక్కడ నుంచి పటమటలోని తన నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో […]

నేడే అమరావతికి పవన్ కళ్యాణ్.. పార్టీ ఓటమిపై నేతలతో సమీక్షలు!
Ravi Kiran

|

Jun 06, 2019 | 7:04 AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి రానున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అక్కడ నుంచి పటమటలోని తన నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు. ఇక ఈ సమావేశం అనంతరం పవన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu