‘ఛలో అంతర్వేది’కి మద్దతు పలికిన జనసేనాని

బీజేపీ చేపట్టిన ఛలో అంతర్వేది కార్యక్రమానికి జనసేన మద్దతు పలికారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్ర రథం దగ్ధం, అంతకుముందు పిఠాపురం, కొండబిట్రగుంటలో జరిగిన ఈ తరహా సంఘటనల పట్ల ప్రభుత్వం..

'ఛలో అంతర్వేది'కి మద్దతు పలికిన జనసేనాని
Follow us

|

Updated on: Sep 10, 2020 | 6:57 PM

బీజేపీ చేపట్టిన ఛలో అంతర్వేది కార్యక్రమానికి జనసేన మద్దతు పలికారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్ర రథం దగ్ధం, అంతకుముందు పిఠాపురం, కొండబిట్రగుంటలో జరిగిన ఈ తరహా సంఘటనల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకే భక్తులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు.

తమ మిత్రపక్షం బీజేపీ  శుక్రవారం ఛలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో దీన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించామన్నారు. భావోద్వేగాలు, మనోభావాలు కించపరిచారనే ప్రజలు బయటకు వచ్చారని… అలాంటప్పుడు వారితో అనుసంధానం కావాలని నిర్ణయించినట్టు పవన్ వివరించారు.

ఇందుకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలని పార్టీ శ్రేణులను పవన్ కోరారు. ప్రజల మనసులు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉందని పేర్కొన్నారు. ఎవరూ భావోద్వేగానికి గురికాకుండా నిరసన తెలియజేయాలని సూచించారు.