Local polls in AP: స్థానిక సమారానికి జగన్ కీలక ఆదేశాలు
అమరావతి హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల వ్యవధిలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.
CM Jagan issued crucial directions on Local bodies polls: అమరావతి హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల వ్యవధిలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. రిజర్వేషన్లపై సోమవారం కీలక ఆదేశాలను అమరావతి హైకోర్టు జారీ చేసిన నేపథ్యంలో వాటిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా పలు కీలకమైన ఆదేశాలను అధికార యంత్రాగానికి జారీ చేశారు.
వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పినందున ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఎన్నికల నిర్వహణకు వెళ్ళాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. మార్చి నెలాఖరు.. ఏప్రిల్ మొదటి వారం కల్లా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని నిర్దేశించారు.
పంచాయతీరాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చామని, ఎన్నికలల్లో అక్రమాలను నిరోధించేందుకు కొత్త చట్టం ఉపయోగపడుతుందని జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. డబ్బులు, లిక్కర్‌ను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్ తెచ్చామన్న సీఎం.. కొత్త చట్టం అమలుకు పోలీస్‌యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలని, దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలని సీఎం అన్నారు.
ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా డబ్బులు పంచి గెలిచినట్లు తేలితే.. అనర్హత వేటుతోపాటు మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుందని సీఎం హెచ్చరించారు. జిల్లా ఎస్పీలు డబ్బును, మద్యాన్ని అరికట్టాల్సి వుందన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్రలను, గ్రామంలో మహిళా పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు సీఎం. ఎక్కడ డబ్బు పంపిణీ చేశారన్న మాట రాకూడదని, ఎన్నికల్లో లిక్కర్ పంచారన్న మాట రాకూడదని అన్నారు.
ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి కోట్లు కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడంకాదని, ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి సేవచేసే వ్యక్తులు ఎన్నిక కావాలని, అందుకే కోసమే చట్టంలో మార్పులు తీసుకు వచ్చామని జగన్ చెప్పారు. సాధారణ ఎన్నికల ఎన్నికల అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించిన మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్ అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఈ యాప్ డేటా ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు చేరాలన్నారు. గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రులు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా మిత్రలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈయాప్ ఉండాలని.. ఎలాంటి అక్రమం జరిగినా.. వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలని చెప్పారు.
Read this: ఏపీలో ‘స్థానిక’ సమరం.. అందుకే తాత్కాలిక బడ్జెట్ Jagan govt opting vote on account budget..because..?