Covid 19: హమ్మయ్య.. అతడికి కరోనా లేదు..!
ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు విస్తరించిన కోవిడ్ 19 మహమ్మారి ఇప్పుడు భారతీయులను కంగారు పెట్టిస్తోంది. మొదట ముగ్గురిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా.. ఆ తరువాత వారు కోలుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు విస్తరించిన కోవిడ్ 19 మహమ్మారి ఇప్పుడు భారతీయులను కంగారు పెట్టిస్తోంది. మొదట ముగ్గురిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా.. ఆ తరువాత వారు కోలుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మరో ఇద్దరికి కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీలో ఒకరికి, హైదరాబాద్‌లో మరొకరికి ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా కంగారు మళ్లీ పుట్టుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల తిరుపతిలో కంగారు పుట్టించిన అనుమానిత కేసుపై క్లారిటీ వచ్చింది.
నాలుగు రోజుల కిందట కోవిడ్-19 లక్షణాలతో తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి రుయా హాస్పిటల్‌లో చేరడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్రమత్తమైన వైద్యులు బ్లడ్ శాంపుల్స్ సేకరించి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కు పంపారు. అయితే రక్త పరీక్షలో కరోనా నెగటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయమే తిరుపతి రుయా ఆసుపత్రికి రిపోర్టులు చేరగా.. రిపోర్టులు చెక్ చేసిన వైద్యులు అతడికి కోవిడ్-19 లక్షణాలు లేవని ప్రకటించారు. అయితే రోగిని ఇవాళ డిస్‌ఛార్జ్ చేయాలా..? వద్దా..? అన్న దానిపై వైద్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్‌వీ రమణయ్య చెప్పారు.