జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

ధనాధన్ ధన్‌రాజ్‌గా జబర్దస్త్‌లో అడుగుపెట్టిన ధన్‌రాజ్.. కొద్ది రోజుల్లోనే మంచి కమెడియన్‌గా పేరు సాధించాడు. పలు సినిమాల్లో కూడా కనిపిస్తూ జనాల్ని నవ్విస్తూండేవాడు. కానీ అనూహ్యంగా జబర్దస్త్‌లో మాయం అయ్యాడు. అనంతరం ఇప్పుడు అదిరింది షోలో రీఎంట్రీ..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 10, 2020 | 2:24 PM

ధనాధన్ ధన్‌రాజ్‌గా జబర్దస్త్‌లో అడుగుపెట్టిన ధన్‌రాజ్.. కొద్ది రోజుల్లోనే మంచి కమెడియన్‌గా పేరు సాధించాడు. పలు సినిమాల్లో కూడా కనిపిస్తూ జనాల్ని నవ్విస్తూండేవాడు. కానీ అనూహ్యంగా జబర్దస్త్‌లో మాయం అయ్యాడు. అనంతరం ఇప్పుడు అదిరింది షోలో రీఎంట్రీ ఇస్తూ దుమ్ములేపుతున్నాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ధన్‌రాజ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మెగా బ్రదర్ నాగబాబు నవ్వే ‘జబర్దస్త్’కు ఎసెట్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు కమెడియన్ ధన్‌రాజ్. జబర్దస్త్ నుంచి అనూహ్యంగా బయటకు వచ్చిన తర్వాత అదిరింది షోలో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ షో ద్వారా బుల్లితెరపై మరోసారి నవ్వులు కురిపిస్తున్నాడు. కాగా ఈ సందర్భంగా అదిరింది ప్రోగ్రాంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

అదిరింది ప్రోగ్రామ్ అనుకున్నంత హిట్ కాలేదు కదా అనే ప్రశ్నకు.. తామేమీ బెంచ్ మార్క్ పెట్టుకోలేదని, షో ఈ స్థాయిలో సక్సెస్ అయితేనే విజయవంతం అయినట్లు తాము భావించడం లేదని చెప్పుకొచ్చాడు. మొదట ఈ షో 22 ఎపిసోడ్స్ వరకూ మాత్రమే ప్రారంభమయ్యిందని, అయితే ఇప్పుడు జీ తెలుగు ఛానెల్ యాజమాన్యం 52 ఎపిసోడ్స్‌కు పెంచుతూ అనుమతి ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు ధన్‌రాజ్. అలాగే జబర్దస్త్‌తో పోల్చితే అదిరింది తన రెమ్యునరేషన్ ఎక్కువే అని చెప్పాడు. ఇక యూట్యూబ్‌లో అదిరింది స్కిట్స్ వన్ మిలియన్ దాటుతున్నాయని, రేటింగ్స్ కూడా పర్వాలేదని ధన్‌రాజ్ చెప్పుకొచ్చాడు. ఇక నాగబాబు, రోజాల్లో ఎవరు ఇష్టం అంటే నాగబాబు వైపే తన ఓటు అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అంతేకాకుండా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా నాగబాబువైపే ఉన్నారని ధన్ రాజ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu