AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#COVID19 రైల్వే శాఖ వినూత్న ప్రయోగం… ఐసోలేషన్ సెంటర్స్‌గా బోగీలు

కరోనా ప్రభావం దేశాన్ని ఎటువైపు నెడుతుందోనన్న ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని మార్గాలను ఆశ్రయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రైల్వే శాఖ మరో ప్రయోగానికి సిద్దమైంది.

#COVID19 రైల్వే శాఖ వినూత్న ప్రయోగం... ఐసోలేషన్ సెంటర్స్‌గా బోగీలు
Rajesh Sharma
|

Updated on: Mar 28, 2020 | 1:00 PM

Share

Railway department making train bogies into isolation centers: కరోనా ప్రభావం దేశాన్ని ఎటువైపు నెడుతుందోనన్న ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని మార్గాలను ఆశ్రయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రైల్వే శాఖ మరో ప్రయోగానికి సిద్దమైంది. ఇందుకోసం ఆల్ రెడీ చర్యలు ప్రారంభించింది.

దేశంలో గత పన్నెండు రోజులుగా రైలు సర్వీసులను రద్దు చేశారు. కేవలం గూడ్స్ రైళ్ళు మాత్రమే నడుస్తున్నాయి. రైలు ప్రయాణాలు లేకపోవడంతో రైళ్ళని స్టేషన్లలోను, డిపోలలోను వుండిపోయాయి. వీటిలో థర్డ్, సెకెండ్, ఫస్ట్ క్లాస్ బోగీలను ఐసొలేషన్ సెంటర్లుగా మార్చే పనికి శ్రీకారం చుట్టింది రైల్వే శాఖ. వాటిని కెమికల్స్‌తో శుద్ది చేసి.. ఐసొలేషన్ వార్డులుగా మార్చేస్తున్నారు.

రైలు కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్న రైల్వే శాఖ… వాటిని పూర్తిగా శానిటైజ్ చేసి, వార్డుకు తగినట్టుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో ఐసొలేషన్ వార్డులు, క్వారెంటైన్ సెంటర్లు, ఐసీయూ బెడ్స్ సిద్దం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఆల్ రెడీ కరోనా సోకిన వారు దేశంలోకి ఎంటరై వుండి వుంటే వారి ద్వారా మరెంత మందికి ఆల్ రెడీ తాకి వుంటుందన్న అంఛనాలు ప్రతీ ఒక్కరిలోను ఆందోళన రేపుతున్నాయి.

ఈ క్రమంలో వేల సంఖ్యలో ఐసొలేషన్ వార్డులను రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం… మిగిలిన అవకాశాలను పరిశీలిస్తోంది. అందుకే ప్రైవేటు రిసార్టులను, ఇంటీరియల్ ప్లేస్‌లలో వున్న ప్రభుత్వ సంస్థల భవనాలను ఐసొలేషన్ సెంటర్లుగా, క్వారెంటైన్ సెంటర్లుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రైల్వే బోగీలను కూడా ఐసొలేషన్ సెంటర్లుగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటి ద్వారా ఐసొలేషన్ సెంటర్ల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ వుందని రైల్వే అధికారులు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న