కేరళ తీరంలో ఇస్లామిక్ స్టేట్ అలజడి…

గత నెల శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు ఉగ్రదాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. అయితే వారు ఇప్పుడు లక్షద్వీప్ దీవుల మీదుగా కేరళ తీరానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అధికారులు కేరళ తీరప్రాంత పోలీసులు, తీర ప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. అయితే […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:08 pm, Sun, 26 May 19
కేరళ తీరంలో ఇస్లామిక్ స్టేట్ అలజడి...

గత నెల శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు ఉగ్రదాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. అయితే వారు ఇప్పుడు లక్షద్వీప్ దీవుల మీదుగా కేరళ తీరానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అధికారులు కేరళ తీరప్రాంత పోలీసులు, తీర ప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఇలాంటి హెచ్చరికలు సాధారణమే అయినా.. ఈ సారి పక్కా సమాచారం ఉన్నట్లు పేర్కొన్నారు. అనుమానిత పడవల విషయంలో అలర్ట్‌గా ఉండాలని పోలీసులకు ఉన్నాతాధికారులు సూచించారు.