AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుంజుకున్న బీజేపీ.. తెలంగాణపై మోదీ నజర్!

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలామంది భావించప్పటికీ కమలనాధులు సొంతంగా దేశం మొత్తంలో 300 సీట్లుతో విజయడంక మోగిస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. తమకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలు మాత్రమే కాదు.. బలహీనంగా ఉన్న పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈసారి బీజేపీ ఓట్ల శాతం గతంలో కన్నా గణనీయంగా పెరిగింది. ఇక ముఖ్యంగా తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో […]

పుంజుకున్న బీజేపీ.. తెలంగాణపై మోదీ నజర్!
Ravi Kiran
|

Updated on: May 26, 2019 | 2:12 PM

Share

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలామంది భావించప్పటికీ కమలనాధులు సొంతంగా దేశం మొత్తంలో 300 సీట్లుతో విజయడంక మోగిస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. తమకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలు మాత్రమే కాదు.. బలహీనంగా ఉన్న పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈసారి బీజేపీ ఓట్ల శాతం గతంలో కన్నా గణనీయంగా పెరిగింది. ఇక ముఖ్యంగా తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో 10 శాతం నుంచి 20 శాతానికి.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లను పెంచుకోవడం గమనార్హం.

పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ బలపడతామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులు అంటున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తెలంగాణాలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో కేసీఆర్ కేంద్రంతో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త కేబినెట్‌లో తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఒకరు లేదా ఇద్దరికీ చోటు దక్కే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా అయితే బీజేపీ జాతీయ నేతలు తెలంగాణ రాష్ట్రంపై ఇదివరకన్నా ఇకపై ఎక్కువగా దృష్టి సారించవచ్చని వారి అంచనా. మొత్తానికి మోదీ నయా కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఎంతమందికి చోటు లభిస్తుందో వేచి చూడాలి.