జగన్‌ను దూషించిన టీడీపీ ఎమ్మెల్యేపై కేసు
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే చిక్కుల్లోపడ్డారు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు. ఏపీకి కాబోయే సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు ఆయనపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి తర్వాత ఆయన.. కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. ఈ క్రమంలో జగన్‌ను దూషించినందుకు ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ముమ్మాటికి […]
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే చిక్కుల్లోపడ్డారు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు. ఏపీకి కాబోయే సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు ఆయనపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి తర్వాత ఆయన.. కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. ఈ క్రమంలో జగన్‌ను దూషించినందుకు ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించడమేనని అందులో ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి రామకృష్ణబాబు మాట్లాడిన వీడియోను.. వైసీపీ నేత విజయనిర్మల తమ ఫిర్యాదుకు జతచేశారు. దీన్ని పరిశీలించిన పోలీసు అధికారులు 294ఏ, 188 సెక్షన్ల కింద వెలగపూడి రామకృష్ణబాబుపై కేసు నమోదు చేశారు.