త్రిపురలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉనాకోటి, ధలాయ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు పాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. కాగా పలుచోట్ల వరదలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వర్షాల ధాటికి నిరాశ్రయులైన 739 మంది బాధితులు.. సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కుండపోత వర్షాల కారణంగా ఇప్పటికి మొత్తం 1,039 ఇళ్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెళ్లడించారు. మొత్తం 40 బోట్లను ఏర్పాటు చేసి బాధితులను […]
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉనాకోటి, ధలాయ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు పాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. కాగా పలుచోట్ల వరదలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వర్షాల ధాటికి నిరాశ్రయులైన 739 మంది బాధితులు.. సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కుండపోత వర్షాల కారణంగా ఇప్పటికి మొత్తం 1,039 ఇళ్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెళ్లడించారు. మొత్తం 40 బోట్లను ఏర్పాటు చేసి బాధితులను సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు.