BSF On High Alert: దేశ సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాదులు.. నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తమై బీఎస్ఎఫ్ బలగాలు..

జమ్మూకశ్మీరులో ఉగ్ర దాడి చేసేందుకు పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో 118 మంది పాక్ ఉగ్రవాదులు పొంచిఉన్నట్లు భారత నిఘావర్గాలకు సమాచారం అందింది.

BSF On High Alert: దేశ సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాదులు.. నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తమై బీఎస్ఎఫ్ బలగాలు..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 6:08 PM

Jammu Region BSF On High Alert: ఎన్నిసార్లు హెచ్చరించిన వక్రబుద్ధి మార్చుకోవడంలేదు పాకిస్తాన్. నిత్యం ఎదో రూపంతో కుయుక్తులకు పణ్ణంగా పన్నుతోంది. తాజాగా జమ్మూకశ్మీరులో ఉగ్ర దాడి చేసేందుకు పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో 118 మంది పాక్ ఉగ్రవాదులు పొంచిఉన్నట్లు భారత నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో ఉగ్ర మూకను అడ్డుకునేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు(బీఎస్ఎఫ్) అప్రమత్తమైంది. జమ్మూకశ్మీరులోని భారత భద్రతాదళాలపై దాడులు చేసే వ్యూహంతో పాక్ ఐఎస్ఐ ఉగ్రవాదులను సరిహద్దుల్లో మోహరించిందని ఇంటెలిజెన్సు హెచ్చరించింది. ఐఎస్ఐ పాక్ ఉగ్రవాదులకు జీపీఎస్, నావిగేషన్ సిస్టమ్ లను అందించిందని నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో బీఎ‌స్‌ఎఫ్ పోర్స్ భారీ బలగాలు చేరుకుంటున్నాయి.

పాక్ సరిహద్దులో వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు. త్వరలో భారత దేశం జరుగనున్న రిపబ్లిక్ వేడుకలను దృష్టిలో పెట్టుకుని భారీ కుట్ర పన్నాగం పన్ని ఉంటాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇదే క్రమంలో నియంత్రణ రేఖ సమీపంలో వివిధ లాంచ్ ప్యాడ్లలో 180 మంది ఉగ్రవాదులున్నారని నవంబరు నెలలో ఇంటెలిజెన్సు వర్గాలకు సమాచారం అందింది. కశ్మీరు లోయ సమీపంలోని పాక్ సరిహద్దుల్లో 65 మంది ఉగ్రవాదులున్నట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. జమ్మూ ప్రాంతానికి చేరువలో 118 మంది ఉగ్రవాదుల కదలికలు కనిపించాయని.. గత నెలలో జరిగిన కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలకు భంగం కలిగించాలని యత్నించినా వారి ఎత్తుగడ పారలేదని బీఎస్‌ఎఫ్ అధికారులు చెబుతున్నారు.

ఈ శీతాకాలంలో పాక్ సరిహద్దుల నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. పాక్ సరిహద్దుల్లోని లూనియా ధోక్, దేగ్వార్ ట్రెవాన్, చిరికోట్ నబన్, తండి కస్సీ, పిపి నాలా, ఎల్పీ సమాని, దేవా, పూద్ సరసన కృష్ణ ఘాటి, భీంబర్ గాలి, నౌషెరా, సుందర్బానీ లాంచ్ ప్యాడ్లలో ఉగ్రవాదుల ఉనికి కనిపించింది. దీంతో సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమై పహరాను ముమ్మరం చేసినట్లు సమాచారం.

పెషావ‌ర్‌లో విషాదం.. ఆటాడుకుంటుండగా పేలిన గ్రేనేడ్.. ఇద్దరు పిల్లలు మృతి, మరో ముగ్గురికి సీరియస్