Salaar Movie Update: ప్రభాస్ ‘సలార్’ విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ నటుడిని సంప్రదించిన చిత్రబృందం ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా 'సలార్'. కేజీఎఫ్-2 మూవీ తర్వాత తాను
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ‘సలార్’. కేజీఎఫ్-2 మూవీ తర్వాత తాను తెరకెక్కించబోతున్న సినిమా సలార్ అంటూ ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అధికారింగా ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచి ఆ మూవీ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌కు విలన్‌గా నటించేది ఓ బాలీవుడ్ స్టార్ అంటూ కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దాదాపు ఆ మూవీ చిత్రీకరణ పూర్తి దశకు చేరుకుంది. రాదేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నాడు. దీంతోపాటు ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా షూటింగ్లో పాల్గోననున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ప్రభాస్‌కు జోడీగా లోఫర్ మూవీ హీరోయిన్ దిశా పటాని నటించనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించనున్నట్లుగా సమాచారం. ప్రభాస్‌కు ప్రత్యర్థిగా పవర్ ఫుల్ వ్యక్తి ఉండాలని.. అందుకోసమే అబ్రహంను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం గురించి ఇప్పటికే చిత్రయూనిట్ అబ్రహంను సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు చిత్రబృందం నుంచి ఈ మూవీ విలన్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.
Also Read: ప్రభాస్ తర్వాత కూడా టాలీవుడ్ స్టార్ హీరోతోనే కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా ఉండనుందట..