Maine Pyar Kiya: ఆ సినిమా లేకపోతే నేను లోకానికి తెలిసేదాన్ని కాదు.. అందుకే ఏడుసార్లు నో చెప్పినా..
Maine Pyar Kiya: లవ్ స్టోరీకి కొత్త అర్థం చెప్పిన సినిమా ‘మైనే ప్యార్ కియా’. 1989వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ

Maine Pyar Kiya: లవ్ స్టోరీకి కొత్త అర్థం చెప్పిన సినిమా ‘మైనే ప్యార్ కియా’. 1989వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. కుర్రకారును హుషారెత్తించింది. ప్రేమికులంటే సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీలా ఉండాలనేంతగా తీసుకొచ్చింది. ఈ సినిమాతో వీరిద్దరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన భాగ్యశ్రీ ఈ సినిమా ద్వారానే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన హోమ్లీ నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. అయితే ఈ సినిమా గురించి భాగ్యశ్రీ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఈ సినిమాలో నటించడానికి భాగ్యశ్రీ ఏడుసార్లు నో చెప్పిందట. తను విదేశాలకు వెళ్లి స్టడీస్ కంప్లీట్ చేయాలని పట్టుబట్టగా తండ్రి మాత్రం ఇండియాలోనే చదువు పూర్తి చేయాలని సూచించారట. ఇంట్లో ఈ చర్చ జరుగుతున్న క్రమంలోనే డైరెక్టర్ తన దగ్గరకు ‘మైనే ప్యార్ కియా’ స్క్రిప్ట్‌తో వచ్చారని వెల్లడించింది. దాదాపు ఏడుసార్లు డైరెక్టర్ స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతూ తనను అప్రోచ్ అయినా ప్రతీసారి ఏదో ఒక వంక చెప్పేదాన్నని, మొత్తానికి ఏడోసారి ఒప్పుకున్నానని తెలిపింది. ఆ సినిమా లేకపోతే ‘భాగ్యశ్రీ అనే నేను’ లోకానికి తెలియకుండేదని చెప్పింది.



