Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangles : మట్టిగాజులు ధరించడం వలన మహిళలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

Bangles: హిందూ సాంప్రదాయంలో కట్టు బొట్టు దగ్గర నుంచి నడిచే నడక ఇలా అన్నింటికీ ఓ పధ్ధతిని పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక హిందూ సంప్రదాయంలో...

Bangles :  మట్టిగాజులు ధరించడం వలన మహిళలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Bangles
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2021 | 10:32 AM

Bangles: హిందూ సాంప్రదాయంలో కట్టు బొట్టు దగ్గర నుంచి నడిచే నడక ఇలా అన్నింటికీ ఓ పధ్ధతిని పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక హిందూ సంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తు. అతి పురాతనమైన చేతికళ పరిశ్రమలో చేతి గాజుల పరిశ్రమ ఒకటి. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి మట్టిగాజులు. స్త్రీలు నగలను, చీరలను ఎంత ఇష్టపడతారో.. గాజులను కూడా అంతే ఇష్టపడేవారు. అయితే మారుతున్న కాలంలో ధరించే దుస్తుల దగ్గరనుంచి అనేక మార్పులు వచ్చాయి. దీంతో చాలామంది గాజులు మహిళలు గాజులు వేసుకోవడం తగ్గించారు. ఏమైనా సాంప్రదాయ దుస్తులు ధరించే సమయంలో లేదా పండగలు ఫంక్షన్లు ఉంటేనే గాజుల వైపు చేసే రోజులు వచ్చాయి. అయితే గతంలో మహిళలు చేతి నిండా గాజులు వేసుకొని గలగలా సవ్వడితో నట్టింట్లో తిరిగేవారు. ఇప్పటికీ పెళ్లి, సీమంతం వంటి సందర్భాల్లో చేతి నిండా గాజులు వేసి దీవించడం ఆనవాయితీ. గాజులు సౌభాగ్యానికి సూచిక. అయితే ఇలా గాజులు వేసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎన్నోప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో చూద్దాం..

*చేతులకు గాజులు వేసుకున్నవారికి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. చేతినిండా గాజులు వేసుకున్నాక అవి మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురి చేయడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. అందుకే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ చేతులకు గాజులు వేసుకునేవారు.. పని చేస్తున్నప్పుడు అవి కిందకి పైకి జరుగుతూ రక్త నాళాలకు మసాజ్ అందించి రక్త ప్రసరణను సజావుగా చేస్తాయి.

*అంతేకాదు గాజులు వేసుకుని పనిచేసే మహిళలు అలసటకు తక్కువగా గురవుతారట.గాజులు వేసుకోవడం వల్ల మన శరీరంలో శక్తి స్థాయులు పెరగడంతో పాటు అలసట తగ్గుతుంది.

*ఈ గాజుల ధరించినవారికి ఒత్తిడి. నొప్పిని భరించే శక్తి లభిస్తుందట. గాజులు చేతిమీద కదులుతూ మసాజ్ చేయడం వల్ల ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి శక్తి జనరేట్ అవుతుందట.

*మట్టి గాజులు వేసుకుంటే . శరీరంలో వేడిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతుందట. అందుకనే ఎన్ని బంగారం గాజులు వేసుకున్నా కనీసం రెండైనా మట్టి గాజు చేతికి ఉండాలని పెద్దలు కండిషన్ పెట్టినట్లున్నారు.

*మహిళల శరీరం మగవారితో పోల్చితే చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో హార్మోన్లు అసమతౌల్యత గురవుతుంటాయి. అందుకే గాజులు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలన్స్ డ్ ఉంటుంది. ప్రస్తుతం చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల అసమతౌల్యత సమస్య ఎదురవుతోంది. దీనివల్ల రుతుక్రమం కూడా క్రమం తప్పుతుంది. ప్రతి స్థాయిలో మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. గాజులు వేసుకోవడం వలన చాలా వరకూ ఈ సమస్య ధరిచేరదట.

*గాజులు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయట. హార్మోన్లు సమతుల్యంగా ఉండడం వల్ల, శరీరంలో అన్ని జీవక్రియలు ఆరోగ్యంగా సాగడం వల్ల మానసికంగానూ ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది.

*అందుకే పూర్వకాలంలో గర్భిణులకు శ్రీమంతం చేసి చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యేవరకూ ఉంచుకోవాలని చెప్పేవారు. గర్భం ధరించిన వారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ప్రసవం సమయంలో నొప్పిని భరించే శక్తి కూడా వీటి వల్ల అందుతుందని అప్పట్లో భావించేవారు.

*అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. పుట్టింటి వారు ఇచ్చే గాజులకు ఎంతో విలువ ఇస్తుంది భారతీయ మహిళ. ఇలా స్త్రీ జీవితంలో గాజులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. స్త్రీకి గాజులు అందం ఆరోగ్యమే కాదు.. అనేక విలువతో కూడిన జాగ్రత్తలను నేర్పుతుంది. మన సంప్రదాయాలను చాదస్తం అనకుండా తరచిచూస్తే ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలు కలిగి ఉంటాయి. వీటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం తల్లిదండ్రులదే.

Also Read: అనేక రహస్యాలు నెలవు ఈ శివాలయం తల్లికోసం పాండవులు ఒక్కరాత్రిలో నిర్మించినట్లు పురాణాల కథనం