AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Warns: అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం.. యుద్ధం నిలిపివేతకు షరతులు విధించిన ఇరాన్

Iran Warns: ఈ షరతులు, అమెరికా వాగ్దానాలు నెరవేరే వరకు ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూసివేసే ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ షరతులపై..

Iran Warns: అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం.. యుద్ధం నిలిపివేతకు షరతులు విధించిన ఇరాన్
Us - Iran
Subhash Goud
|

Updated on: Sep 21, 2026 | 8:52 AM

Share

Iran Warns: అమెరికా మళ్ళీ దాడులకు తెగబడితే అంతకంటే బలమైన, మరింత దారుణమైన దాడులతో తిప్పికొడతామని ఇరాన్ హెచ్చరించింది. ప్రస్తుత యుద్ధాన్ని ముగించి, తిరిగి చర్చలు ప్రారంభించడానికి కతార్ మధ్యవర్తుల ద్వారా ట్రంప్ పరిపాలనా వర్గానికి ఇరాన్ కొన్ని షరతులను పంపింది. అయితే ఇందు కోసం కొన్ని షరతులను ఉంచింది.

ఇరాన్ విధించిన ప్రధాన షరతులు:

ప్రాంతంలో యుద్ధ వాతావరణం ముగిసి, శత్రుత్వాలకు పూర్తి విరామం లభించాలి. విదేశాల్లో నిలిపివేసిన (ఫ్రోజెన్) ఇరాన్ నిధులను విడుదల చేయాలి. అలాగే ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని వెంటనే ముగించాలి. ఇరాన్ భూభాగంపై అమెరికా జరిపే దాడులను నిలిపివేయాలని షరతులను విధించింది. అలాగే ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు అమెరికా అందిస్తున్న సహకారాన్ని నిలిపివేసి, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలి.

ఈ షరతులను అంగీకరించడమే వాషింగ్టన్‌కు శ్రేయస్కరమని, ట్రంప్ బెదిరింపులు ఏమాత్రం పనిచేయవని, తాము నిర్ణయాత్మక యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని మోహ్‌సేన్ రజాయీ, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

హార్ముజ్ జలసంధి మూసివేత:

ఈ షరతులు, అమెరికా వాగ్దానాలు నెరవేరే వరకు ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) మూసివేసే ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ షరతులపై అమెరికా అధికారికంగా స్పందించలేదు. చర్చలు విఫలమైతే లేదా కొత్త దాడులు జరిగితే తదుపరి పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us