IPL Auction Rules: ఐపీఎల్‌ వేలంలో ఫ్రాంచైజీలు పాటించాల్సిన నియమాలు.. మినీ, మెగా వేలం పాటలకు తేడాలేంటో తెలుసా?

IPL 2021 Auction Rules In Telugu: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ - 2021 మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. రూ.కోట్లతో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. దాదాపు 292 మంది ఆటగాళ్లలో...

IPL Auction Rules: ఐపీఎల్‌ వేలంలో ఫ్రాంచైజీలు పాటించాల్సిన నియమాలు.. మినీ, మెగా వేలం పాటలకు తేడాలేంటో తెలుసా?
Follow us

|

Updated on: Feb 18, 2021 | 11:33 AM

IPL 2021 Auction Rules: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ – 2021 మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. రూ.కోట్లతో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. దాదాపు 292 మంది ఆటగాళ్లలో ఎవరిని అదృష్టం వరించనుందో, ఎవరు ఎక్కువ ధరకు అమ్ముడుపోనున్నారో మరికాసేపట్లో తెలయనుంది. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేలం ప్రారంభంకానుంది. ఈ వేలం పాటలో భారత్‌కు చెందిన 164 మంది, విదేశీ ప్లేయర్లు 125 మంది పాల్గొననున్నారు. అయితే వీరిలో ఫ్రాంచైజీలు కేవలం 61 మందినే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ వేలం కార్యక్రమాన్ని మనమంతా టీవీల్లో వీక్షిస్తుంటాం. అయితే.. ఈ వేలం పాటకు కొన్ని నియమనిబంధనలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా.? ఇంతకీ ప్లేయర్స్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్రాంచైజీలు ఎలాంటి నియమాలను పాటించాలి లాంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.. ప్లేయర్స్‌ను కొనుగోలు చేసే విషయంలో ఫ్రాంచైజీలు ఆరు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..

నిబంధన 1:

ప్లేయర్స్‌ కొనుగోలు చేసేందుకుగాను ఫ్రాంచైజీలు ముందుగా కొంత మొత్తాన్ని నిర్ణయించుకుంటాయి. ఈ మొత్తానికి లోబడే ప్లేయర్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఒక్కో ఫ్రాంచైజీకి ఒక్కోలా ఉంటుంది. ఐపీఎల్‌ 2021కు చెన్నై సూపర్‌ కింగ్స్ చేతిలో రూ.19.9 కోట్లు, ఢిల్లీకి రూ.12.9, పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో రూ. 53.2 కోట్లు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ.10.75 కోట్లు, ముంబై ఇండియన్స్‌ చేతిలో రూ.15.35 కోట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌కు రూ.34.85 కోట్లు, ఆర్‌సీబీకి రూ.35.9 కోట్లు, హైదరాబాద్‌కు రూ.10.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తాన్ని అనుసరించే ఫ్రాంచైజీలు ప్లేయర్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

నిబంధన 2:

రెండో నియమం విషయానికొస్తే.. బీసీసీ, ఐపీఎల్‌ పాలక మండలి ప్రకారం.. ఫ్రాంచైజీలు తమ దగ్గర ఉన్న మొత్తంలో కనీసం 75 శాతం ఆటగాళ్ల కొనుగోలు కోసం వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫ్రాంచైజీ ఈ మొత్తాన్ని ఉపయోగించుకోకుంటే మిగిలిన డబ్బును జప్పు చేస్తారు.

నిబంధన 3:

RTM (రైట్‌ టు మ్యాచ్‌ కార్డ్‌) ఈ నిబంధనను 2018 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని.. వేలంపాట జరుగుతోన్న సమయంలో తమ జట్టులోని ప్లేయర్‌ను నిలుపుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతోంది మినీ వేలంపాట కావడంతో ఆటగాడిని తమ జట్టులోనే నిలుపుకోవడానికి ఫ్రాంచైజీలు RTMను ఉపయోగించుకోలేవు.

నిబంధన 4:

ఫ్రాంచైజీలు బలం 25 మంది ఆటగాళ్లను మించకూడదు.. అదే సమయంలో ఫ్రాంచైజ్‌ జట్టులో 18 కంటే తక్కువ ఉండకూడదు.

నిబంధన 5:

జట్టులో క్యాప్‌, అన్‌క్యాప్‌డ్‌తో సహా భారత ఆటగాళ్లను కనీసం 17, అత్యధికంగా 25 మంది ఉండేలా చూసుకోవాలి.

నిబంధన 6:

ఐపీఎల్‌ జట్టులో అత్యధికంగా ఎనిమిది మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండొచ్చు.

మెగా వేలం, మినీ వేలానికి తేడా ఏంటంటే..?

ప్రస్తుతం చెన్నై వేదికగా జరుగనుంది మిని వేలంపాట. మరి ఇంతకీ మినీ, మెగా వేలం పాటకు ఉండే తేడా ఏంటంటే.. ప్రతీ మూడేళ్లకొకసారి మెగా వేలంపాట జరుగుతుంది. ఇక ఈ మూడేళ్ల మధ్యలో మిని వేలంపాట జరుగుతుంది. మెగా వేలంపాటలో ఫ్రాంచైజీలు కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే నిలుపుకోగలవు.. కానీ మినీ వేలంలో ఇలాంటి పరిమితులు ఏమీ ఉండవు.

Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 ఆక్షన్‌ నేడే.. సమయం, వేదిక, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు