AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉతప్ప, ఇలా చేస్తే ఎలా..?

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బంతిపై మెరుపు కోసం ఉమ్మిని(సలైవా) రుద్దకూడదని ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఉతప్ప, ఇలా చేస్తే ఎలా..?
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2020 | 2:22 PM

Share

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బంతిపై మెరుపు కోసం ఉమ్మిని(సలైవా) రుద్దకూడదని ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ రూల్ అతిక్రమిస్తే శిక్షలు ఏంటో చెప్పింది. నిబంధన గురించి మర్చిపోయాడో, లేక లైట్ తీసుకున్నాడో తెలియదు కానీ.. బంతికి ఉమ్మి రాస్తూ కెమెరాకు చిక్కాడు రాబిన్‌ ఉతప్ప.

దుబాయ్‌ వేదికగా గురువారం రాత్రి.. రాజస్థాన్‌, కోల్‌కతా నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. టాస్‌ గెలిచిన రాజస్థాన్ సారథి స్టీవ్‌స్మిత్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ (47), మోర్గాన్‌ (34*), రసెల్‌ (24),  నితీశ్‌ రాణా (22), రాణించడం వల్ల 6 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది కోల్‌కతా. ఛేజింగ్ లో రాజస్థాన్‌ తేలిపోయింది. 42 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. స్మిత్‌, సంజు, తెవాతియా, ఉతప్ప ఫెయిలయ్యారు. టామ్‌ కరణ్‌ (54*) హాఫ్ సెంచరీ చేయడమే ఆ జట్టుకు ఊరట. మిగతా ప్లేయర్స్ పెద్దగా రన్స్ చేయకపోవడం వల్ల 137/9కే పరిమితమైంది.

కోల్‌కతా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రాజస్థాన్‌ ఫీల్డర్‌ రాబిన్‌ ఉతప్ప బంతికి లాలాజలం రుద్దాడు. మూడో ఓవర్‌ ఐదో బంతికి నరైన్‌ క్యాచ్‌ను అతడు చేజార్చాడు. ఆ తర్వాత బంతికి ఉమ్మి రుద్దుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతుంది.  బంతికి ఫీల్డర్‌ ఉమ్మి రుద్దితే అంపైర్లు కలగజేసుకొంటారు. బంతిని శానిటైజ్ చేయిస్తారు. ఫస్ట్ టైమ్ ఫీల్డర్‌కు నిబంధనలను వివరిస్తారు. వరుసగా రెండుసార్లు చేస్తే వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాతా అలాగే చేస్తే శిక్షగా ప్రత్యర్థికి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు.

Follow Us
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్..
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్..
పాకిస్తాన్‌లో అమ్మవారి శక్తిపీఠం..ముస్లింలు కూడా వెళ్లేది ఇందుకే!
పాకిస్తాన్‌లో అమ్మవారి శక్తిపీఠం..ముస్లింలు కూడా వెళ్లేది ఇందుకే!
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?